News July 4, 2024
1300 ఏళ్ల నాటి ఖడ్గం.. దొంగిలించేశారు!
ఫ్రాన్స్‌లోని రోకమడౌర్‌లో రాతిలో ఉన్న ఆ ఖడ్గం 1300 ఏళ్ల నాటిది. డురండాల్ కత్తిగా పిలుచుకునే దాన్ని 8వ శతాబ్దంలో రోలాండ్ అనే సేనాధిపతి వాడారట. చనిపోయే ముందు ఆయన కత్తిని విసిరితే వందల మైళ్లు దూరంలోని రోకమడౌర్‌లో రాయిలో దిగబడిందనేది స్థానికుల నమ్మిక. పర్యాటక ఆకర్షణగా ఉన్న ఆ కత్తి చోరీకి గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని అధికారులు తెలిపారు.
Similar News
News January 16, 2025
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘డాకు మహారాజ్’
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్లు (గ్రాస్) కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. కాగా, ఈ సినిమా రేపటి నుంచి తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
News January 16, 2025
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పలు హామీలు ఇచ్చింది. హామీల పోస్టర్లను తెలంగాణ సీఎం రేవంత్ విడుదల చేశారు.
1. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్
2. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
** తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
News January 16, 2025
నాపై దాడి జరిగింది.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు
AP: తనపై, తన భార్యపై దాడి జరిగిందని తిరుపతి(D) చంద్రగిరి పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు వర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించడం లేదని మనోజ్ ప్రశ్నించగా, శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని ఆయనకు పోలీసులు సూచించారు. నిన్న MBUలోకి వెళ్లేందుకు యత్నించిన ఆయనను పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే.