News July 4, 2024
IND- PAK- AUSతో ముక్కోణపు సిరీస్‌కు సిద్ధం: క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో
భారత్, పాక్ ఆడే మ్యాచ్‌లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా CEO నిక్ హాక్లీ చెప్పారు. దాయాది దేశాలు, ఆసీస్‌తో కలిపి ముక్కోణపు సిరీస్ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. తుది నిర్ణయం భారత్, పాక్ బోర్డులపైనే ఆధారపడి ఉంటుందని, ఇప్పటి వరకు తాము చర్చలు జరపలేదని పేర్కొన్నారు. 2012 నుంచి IND-PAK ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడని విషయం తెలిసిందే. ICC ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి.
Similar News
News January 16, 2025
కి.మీ.కు రూ.3.91 కోట్లు.. సైకిల్ ట్రాక్ పగుళ్లపై కాంగ్రెస్ విమర్శలు
హైదరాబాద్‌లోని సైకిల్ ట్రాక్‌పై పగుళ్లు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు గత BRS సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘కాళేశ్వరం, సుంకిశాల.. ఇప్పుడు సైకిల్ ట్రాక్. కేటీఆర్ కట్టించిన సైకిల్ ట్రాక్ పరిస్థితి ఇది’ అని పగుళ్లు వచ్చిన ఫొటోలను షేర్ చేస్తున్నాయి. ఐటీ కారిడార్‌లోని నానక్‌రామ్ గూడ నుంచి ORR ఇంటర్‌ఛేంజ్ వరకు రెండు వైపులా 23 కి.మీ మేర ఈ ట్రాక్ ఏర్పాటు చేశారు. కి.మీకు రూ.3.91 కోట్ల మేర ఖర్చయింది.
News January 16, 2025
BUDGET 2026: రైల్వేస్‌కు 20% నిధుల పెంపు!
బడ్జెట్లో రైల్వేస్‌కు 20% ఎక్కువ నిధులు కేటాయిస్తారని సమాచారం. FY25లో కేటాయించిన రూ.2.65లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్లకు పెంచుతారని తెలుస్తోంది. ప్రస్తుత CAPEXలో ఇప్పటికే 80-90% మేర ఖర్చుపెట్టేశారు. FY26లో మరిన్ని రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయడం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, రైల్వే ట్రాకుల డీకంజెషన్ వంటి పనులు చేపట్టనున్నారు. అందుకే నిధులు పెంచుతారని విశ్లేషకులు అంటున్నారు.
News January 16, 2025
సైఫ్‌కు తప్పిన ప్రాణాపాయం.. ముగిసిన సర్జరీలు
యాక్టర్ సైఫ్ అలీఖాన్ కాస్మొటిక్, న్యూరో సర్జరీలు ముగిశాయి. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని లీలావతీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. ఆపరేషన్లు ముగిశాక అతడి భార్య కరీనా కపూర్ సహా కుటుంబ సభ్యులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్‌ను దుండగుడు 6 సార్లు <<15167259>>కత్తి<<>>తో పొడిచాడు. దాంతో అతడి మెడవద్ద లోతైన గాయం అయింది.