News July 4, 2024

IND- PAK- AUSతో ముక్కోణపు సిరీస్‌కు సిద్ధం: క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో

image

భారత్, పాక్ ఆడే మ్యాచ్‌లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా CEO నిక్ హాక్లీ చెప్పారు. దాయాది దేశాలు, ఆసీస్‌తో కలిపి ముక్కోణపు సిరీస్ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. తుది నిర్ణయం భారత్, పాక్ బోర్డులపైనే ఆధారపడి ఉంటుందని, ఇప్పటి వరకు తాము చర్చలు జరపలేదని పేర్కొన్నారు. 2012 నుంచి IND-PAK ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడని విషయం తెలిసిందే. ICC ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి.

Similar News

News December 11, 2025

షాద్‌నగర్ MLA స్వగ్రామంలో BRS గెలుపు

image

షాద్‌నగర్ MLA స్వగ్రామం నందిగామ మండలంలోని వీర్లప్లలిలో BRS బలపరిచిన అభ్యర్థి గెలుపు ఢంకా మోగించారు. వీర్లపల్లి గ్రామ సర్పంచ్‌గా పాండు గెలుపు టాక్ ఆఫ్ ది నియోజకవర్గంగా మారింది. దీంతో బీఆర్ఎస్ నేతలు గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వారు తెలిపారు. 21 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

News December 11, 2025

గురుకుల స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 5, 6, 9వ తరగతుల్లో చేరికలకు 2026 FEB 22న ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని ప్రకటించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో JAN 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది. ప్రాస్పెక్టస్ వివరాలకు ‘https://tgcet.cgg.gov.in’ సందర్శించవచ్చని సూచించింది.

News December 11, 2025

ఓటమిని తట్టుకోలేక పురుగు మందు తాగింది..

image

TG: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాహైమద్‌పల్లిలో సర్పంచ్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి లక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.