News July 4, 2024
7న TTDP నేతలతో చంద్రబాబు భేటీ

తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇక్కడికి వస్తున్నారు. టీటీడీపీ నేతలు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సమావేశంలో టీటీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 30, 2026
టీవీకే చీఫ్ విజయ్‌కి రూ.520 కోట్ల ఆస్తులు!

TVK చీఫ్ విజయ్ తనకు ₹520Cr+ (₹405Cr చరాస్తులు, ₹115Cr స్థిరాస్తులు) ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. భార్య సంగీత పేరిట ₹15Cr+ చరాస్తులు, ₹2.5Cr స్థిరాస్తులు, ₹85Cr బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. విజయ్ వద్ద 800gm+ బంగారం, సంగీత వద్ద 3kg+ గోల్డ్, ₹కోటి విలువైన డైమండ్స్, 2kgs వెండి ఉంది. ₹2L నగదు, BMW 530Li, BMW i7తో పాటు మరికొన్ని వాహనాలు ఉన్నాయని, అప్పులు లేవని పేర్కొన్నారు.
News March 30, 2026
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CBNకు ఊరట

AP: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CM చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. దీనిపై YCP మాజీ MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 3 పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కేసును CBIకి అప్పగించాలని, CBNకు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని, ACB కోర్టు విచారణను MP, MLAల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆయన వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. అయితే వీటికి విచారణార్హత లేదని కోర్టు ఇవాళ కొట్టేసింది.
News March 30, 2026
టాస్ గెలిచిన RR

IPL: గువాహటి వేదికగా CSKతో మ్యాచ్‌లో RR టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వెట్ ఔట్‌ఫీల్డ్ కారణంగా టాస్ 5min ఆలస్యంగా వేశారు.
CSK: రుతురాజ్, శాంసన్, ఆయుష్, షార్ట్, దూబే, కార్తీక్ శర్మ, ఓవర్టన్, నూర్ అహ్మద్, హెన్రీ, కాంబోజ్, ఖలీల్
RR: వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, పరాగ్, జురెల్, హెట్‌మెయర్, జడేజా, ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేశ్


