News July 4, 2024
7న TTDP నేతలతో చంద్రబాబు భేటీ

తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇక్కడికి వస్తున్నారు. టీటీడీపీ నేతలు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సమావేశంలో టీటీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 9, 2025
రేపు ఉద్యోగులతో పవన్ మాటామంతీ

AP: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ రేపు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. మంగళగిరిలోని ఓ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలను ఆయన వారికి వివరిస్తారు. అలాగే ఎలాంటి విధానాలు పాటిస్తే గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమో తెలుసుకోనున్నారు. అవినీతిరహిత పాలనను అందించేందుకు సహకరించాలని కోరనున్నారు.
News December 9, 2025
టీ20ల్లో మనదే డామినేషన్.. కానీ!

టీ20ల్లో ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 31 T20 మ్యాచులు జరగగా భారత్ 18, SA 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. అయితే సొంతగడ్డపై ఆడిన 12 మ్యాచుల్లో ఇండియా ఐదింట్లో నెగ్గగా దక్షిణాఫ్రికా ఆరు మ్యాచుల్లో గెలిచింది. మరో మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. కాగా కటక్‌లో ఆడిన రెండు టీ20ల్లో దక్షిణాఫ్రికానే విజయం సాధించడం గమనార్హం.
News December 9, 2025
ఎర్లీ ప్యూబర్టీ ఎందుకొస్తుందంటే?

పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, అధికబరువు, కొన్ని రకాల కాస్మెటిక్స్, సబ్బులు, డిటర్జెంట్లలో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసాన్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిదని సూచిస్తున్నారు.


