News July 4, 2024

వరల్డ్ కప్ విజేతలతో ప్రధానులు

image

టీ20 వరల్డ్ కప్‌-2024లో గెలిచి విశ్వవిజేతలుగా నిలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వరల్డ్ కప్‌ విజేతలతో అప్పటి ప్రధానులు దిగిన ఫొటోలు వైరలవుతున్నాయి. 1983లో తొలి ODI వరల్డ్ కప్ గెలిచిన జట్టుతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఫొటో దిగారు. 2007లో T20 WC గెలిచిన ధోనీ సారథ్యంలోని భారత జట్టు గత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి కెమెరాకు పోజులిచ్చింది.

Similar News

News March 9, 2026

ఓటమిని ఓప్పుకోని యోధుడు ❤️‘సన్’జూ!

image

చీకటిని చీల్చి నిప్పులు కక్కుతూ సూర్యుడెలా ఉదయిస్తాడో సంజూ అలా వెలిగాడు ఈ WCలో. తొలుత జట్టులో చోటు దక్కకపోయినా నిరాశ చెందలేదు. తనకూ ఛాన్స్ వస్తుందనే ఓపికతో ముందుకు సాగారు. నిరీక్షణకు తెరపడగానే సింహంలా గర్జించారు. అది ఎంతలా అంటే 140 కోట్ల మంది భారతీయులు గర్వించేలా. IND జట్టు కప్పును ముద్దాడేలా. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే. ఓటమిని ఒప్పుకోకుండా సంజూలా ముందుకు సాగడమే మనం నేర్చుకోవాలి. ఏమంటారు?

News March 9, 2026

ఇంట్లో 5-6 మంది ఉంటే ట్రిపుల్ బెడ్ రూమ్: CM CBN

image

AP: సంక్షేమ పథకాల్లో పెద్ద కుటుంబాలకు ప్రాధాన్యమిస్తామని CM CBN అన్నారు. ‘ఇంట్లో 5-6 మంది ఉంటే ట్రిపుల్ బెడ్ రూమ్ ఇస్తాం. అవసరమైతే అదనపు పెన్షన్ ఒకటి ఇస్తాం. కుటుంబంలో 10 మంది ఉంటే 60 కిలోల వరకూ రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం’ అని మహిళా దినోత్సవ కార్యక్రమంలో వెల్లడించారు. గ్యాస్ ధరలు పెరిగినా 3 సిలిండర్లు ఫ్రీగానే ఇస్తామని చెప్పారు. త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలవుతుందన్నారు.

News March 9, 2026

రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

image

T20WC ఫైనల్ తర్వాత కెప్టెన్ సూర్య రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ఊహాగానాలకు తెరపడింది. ‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇప్పుడు అంతా బాగానే ఉందిగా. రిటైర్మెంట్ గురించి ఆలోచన ఎందుకు?’ అని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్టర్ ప్రశ్నకు SKY బదులిచ్చారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఒలింపిక్స్‌తో పాటు తదుపరి T20WC గెలవడంపై ఉందని భవిష్యత్ ప్రణాళికలు స్పష్టం చేశారు. ఈ 2 మెగా ఈవెంట్లు 2028లో జరగనున్నాయి.