News July 5, 2024

ఖైదీని కలిసేందుకు జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారు: హోం మంత్రి

image

AP: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ రూ.25 లక్షలు ఖర్చు చేశారని హోం మంత్రి అనిత ఆరోపించారు. హెలికాప్టర్‌లో జగన్ నెల్లూరు జైలుకు వెళ్లారన్నారు. పిన్నెల్లిని కలిసేందుకు ములాఖత్‌లు అయిపోయినా.. మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతిచ్చామన్నారు. పిన్నెల్లి ఈవీఎంలు పగులగొట్టడం, దాడులు చేయడం సీసీ టీవీల్లో రికార్డయ్యాయని.. అయినా జగన్ అక్రమంగా అరెస్ట్ చేశారనడం దారుణమన్నారు.

Similar News

News April 1, 2026

ఇరాన్‌ యుద్ధం.. అమెరికాతో విభేదించిన బ్రిటన్

image

ఇరాన్ యుద్ధం విషయంలో <<19525908>>అమెరికా<<>>తో బ్రిటన్ విభేదించింది. ఈ ఘర్షణల్లోకి ప్రవేశించేది లేదని PM స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధంతో సంబంధం లేనప్పటికీ.. తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఘర్షణల్ని ఆపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హార్ముజ్ పున:ప్రారంభానికి ఉన్న మార్గాల్ని అన్వేషించేందుకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు.

News April 1, 2026

7.30 గంటల నిడివితో ధురంధర్!

image

కంటెంట్, అధిక రన్ టైమ్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ‘ధురంధర్’ మేకర్స్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు పార్టులు కలిపి 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన CBFC సర్టిఫికెట్ SMలో వైరలవుతోంది. OTTలో విడుదల చేస్తారా? థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తారా? అనేది క్లారిటీ లేదు. గతేడాది ‘బాహుబలి: ది ఎపిక్’ 3 గంటల 44 నిమిషాలతో రిలీజైన విషయం తెలిసిందే.