News July 5, 2024
ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్‌తో సీఎం చంద్రబాబు భేటీ

AP: ఢిల్లీలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగరియాతో ఆయన భేటీ అయ్యారు. తర్వాత నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, రామ్‌దాస్ అథవాలెతో సమావేశం కానున్నారు. ఫిక్కీ ఛైర్మన్, ప్రతినిధులనూ కలుస్తారు. సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
Similar News
News March 14, 2026
పవన్ ‘అడవి తల్లి బాట’ వెనుక ప్రత్యేక వ్యూహం!

AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని JSP చీఫ్ పవన్ ఇవాళ పాడేరు ఏజెన్సీలో నిర్వహించి ‘అడవితల్లి బాట’ చేపట్టారు. ఆయన కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిసారించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ సాగుతోంది. 2019లో 7 ST నియోజకవర్గాలను గెల్చుకొని ఏజెన్సీలో YCP పట్టుబిగించింది. 2024లో కూటమి జోరులోనూ 2సీట్లు గెల్చుకుంది. YCPకి చెక్ పెట్టేలా పవన్ తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
News March 14, 2026
రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ నెల 25న పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. BRS నుంచి వచ్చిన జగిత్యాల MLA సంజయ్‌కి పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన పలుమార్లు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ వైరం ముదిరింది. దీనిపై జీవన్ రెడ్డి Way2Newsతో మాట్లాడుతూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానానికి వివరించినా లాభం లేదని వాపోయారు.
News March 14, 2026
నెతన్యాహు చనిపోయారా?

ఇరాన్‌తో యుద్ధం వేళ సంచలన ప్రశ్న తెరపైకి వచ్చింది. నెతన్యాహు మృతి చెందారని SMలో ప్రచారం జరుగుతోంది. యుద్ధం గురించి మాట్లాడిన వీడియోను ఆయన నిన్న Xలో షేర్ చేశారు. అందులో నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లున్నాయి. దీంతో ఇది AI వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెతన్యాహు మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఇలా AIతో వీడియో చేసి రిలీజ్ చేశారని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.


