News July 6, 2024

టీ20 WC నెగ్గడంలో రోహిత్‌ది కీలక పాత్ర: గవాస్కర్

image

టీ20 WC టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభ తనను ఆకట్టుకుందని మాజీ ప్లేయర్ గవాస్కర్ అన్నారు. ‘జట్టు విజయంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. బౌలింగ్‌లో బుమ్రా, బ్యాటింగ్‌లో కోహ్లీ చాంపియన్స్. వీరందరినీ నడిపించి జట్టును గెలిపించిన రోహిత్ ప్రధాన పాత్రధారి. క్లిష్ట పరిస్థితుల్లో నిస్పృహను దరిచేరనీయకుండా సమర్థంగా వ్యవహరించి కప్ నెగ్గేందుకు కారణమయ్యారు’ అని కొనియాడారు.

Similar News

News January 17, 2025

హీరోపై దాడి.. నిందితుడి కోసం వేట, ఒకరి అరెస్టు

image

సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి కేసు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడు చివరిసారిగా ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌లో పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం వాసాయి-విరార్ వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పోలీసు టీంలు వాసాయి, నల్లసోపారా, విరార్ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News January 17, 2025

పంచాయతీ కార్యదర్శులకు షాక్!

image

TG: నల్గొండ(D)లో అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరైన 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసును జిల్లా కలెక్టర్ బ్రేక్ చేశారు. దీంతో గైర్హాజరైన కాలానికి సంబంధించిన సర్వీసును వారు కోల్పోనున్నారు. దీని వల్ల సర్వీస్ రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల విషయంలో వారికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వీరిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. పాత స్థానాల్లో కాకుండా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు.

News January 17, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.650 పెరిగి రూ.81,270కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.74,500 పలుకుతోంది. కేజీ వెండి రూ.1000 పెరిగి రూ.1,04,000కు చేరింది.