News July 6, 2024

8న రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు: సజ్జల

image

AP: దివంగత YSR 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ మళ్లీ చైతన్యవంతమై ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ఇది తొలి అడుగుగా ఉండాలని పేర్కొన్నారు.

Similar News

News October 14, 2024

పంచాయతీలను జగన్ నిర్వీర్యం చేశారు: నిమ్మల

image

AP: సంక్రాంతిలోపు 3వేల కి.మీల సిమెంట్ రోడ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోరింటాడలో పల్లెపండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీ నిధుల్ని దారి మళ్లించిన జగన్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు. పంచాయతీలను నిర్వీర్యం చేసి, సర్పంచులను భిక్షాటన చేసే దుస్థితికి తెచ్చారని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు.

News October 14, 2024

డీఎస్సీ ఫ్రీ కోచింగ్.. ఆ అభ్యర్థులకు గమనిక

image

AP: డీఎస్సీ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఈ నెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అప్లై చేసిన వారు జ్ఞానభూమి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలంది. ఈ నెల 27న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపింది. అర్హులను ఎంపిక చేసి శిక్షణ అందిస్తామంది.

News October 14, 2024

‘కంగువ’ డబ్బింగ్ కోసం అధునాతన టెక్నాలజీ!

image

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ వచ్చే నెల 14వ తేదీన ఎనిమిది భాషల్లో రిలీజ్ కానుంది. అయితే, దీనికోసం మూవీ టీమ్ డబ్బింగ్ ఆర్టిస్టును ఉపయోగించలేదు. దర్శకుడు శివ అతని బృందం అధునాతన AI సాంకేతికతను ఉపయోగించినట్లు సినీవర్గాలు తెలిపాయి. సూర్య వాయిస్‌ని ప్రతి భాషలో AI డబ్బింగ్ చేసినట్లు పేర్కొన్నాయి. కాగా, ఈనెల 20న జరిగే ఆడియో లాంచ్‌కు సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రభాస్‌లను ఆహ్వానించినట్లు సమాచారం.