News July 6, 2024
HYD: నురగలు కక్కి చనిపోయాడు..!

కడుపు నొప్పితో ఓ లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం ఇచ్ఛాపురం వాసి ఢిల్లీ రావు(38) నేపాల్ నుంచి చీపురు కట్టల లోడుతో జవహర్‌నగర్‌కు చేరుకున్నాడు. లోడ్ దించిన అనంతరం డ్రైవర్‌ను లేపుదామని క్లీనర్ వెళ్లగా నురగలు కక్కి మృతిచెందాడు. అయితే అంతకుముందు అతడు 2 మాత్రలు వేసుకుని, ENO తాగాడని స్థానికులు తెలిపారు. కేసు నమోదైంది.
Similar News
News January 4, 2026
సైబరాబాద్ పోలీస్ అధికారుల ఫోన్ నంబర్ల మార్పు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నంబర్లు 87126 సిరీస్‌కు మారాయి. పాత నంబర్లు ఇకపై పనిచేయవు. నేటి నుంచి కొత్త నంబర్లలో అధికారులు అందుబాటులో ఉంటారని పోలీసులు తెలిపారు. సీపీ డా.ఎం.రమేశ్- 87126630001, జాయింట్ సీపీ- 8712663002, సీపీ CP- 8712663006, డీసీపీలు ఎస్‌బీ- 3003, మాదాపూర్- 3004, బాలానగర్- 3005, డబ్ల్యూ & సీఎస్‌డబ్ల్యూ- 3008, క్రైమ్- 3009లలో ఇక నుంచి సంప్రదించాలి.
News January 4, 2026
HYD: లవర్ మోజులో.. భర్తను చంపేసింది

మహిళ, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్లంబర్ నారాయణ (35) భార్య బంధిత (27), కుమార్తె (6)తో మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. విద్యాసాగర్ అనే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకున్న ఆమె, అడ్డొస్తున్నాడని లవర్‌తో కలిసి రాడ్డుతో కొట్టి చంపింది. కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. పోలీసుల విచారణలో భార్య నేరాన్ని అంగీకరించింది.
News January 4, 2026
HYD: నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ + జాబ్

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (NAC), EGMM సంయుక్తంగా శిక్షణను నిర్వహిస్తున్నాయి. 18-35 ఏళ్ల గ్రామీణ యువత అర్హులు. 3 నెలల శిక్షణలో భోజనం, వసతి, యూనిఫాం, హెల్మెట్ ఉచితంగా ఇస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. దరఖాస్తు చివరి తేదీ JAN15. nac.edu.in వెబ్‌సైట్ చూడండి.


