News July 6, 2024
మంత్రిని కలిసిన ఆరుగురు BRS ఎమ్మెల్యేలు

TG: హైదరాబాద్ పరిధిలోని ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్బీ నగర్), కేపీ వివేకానంద గౌడ్ (కుత్బుల్లాపూర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), బండారు లక్ష్మారెడ్డి (ఉప్పల్), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజ్‌గిరి) కలిసినవారిలో ఉన్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి వీరు మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది.
Similar News
News January 17, 2026
పాతబస్తీ మెట్రోపై హైకోర్టు ఆరా.. ఫిబ్రవరి 4న కీలక నివేదిక!

MGBS-ఫలక్‌నుమా రూట్‌లో నిర్మించే మెట్రో లైన్ విషయంలో చారిత్రక కట్టడాల రక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. చార్మినార్ వంటి కట్టడాల దృశ్య సౌందర్యం దెబ్బతినకుండా పిల్లర్ల నిర్మాణం ఎలా ఉంటుందో వర్చువల్ వాక్‌త్రూ ద్వారా FEB 4లోగా చూపాలని అధికారులను ఆదేశించింది. వారసత్వ సంపదకు నష్టం వాటిల్లని రీతిలో మెట్రో అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. దీని ఆధారంగానే 5.5KM మేర సాగే ఈ మెట్రో లైన్ ఖరారు కానుంది.
News January 17, 2026
మున్సిపల్ ఎన్నికల శంఖం పూరించిన రేవంత్

TG: పాలమూరు వేదికగా సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికల సమరశంఖం పూరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో తాము ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.
News January 17, 2026
రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు బృందం

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం రేపు దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 20 దేశాల తెలుగు ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్‌తో భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న HYD చేరుకోనున్నారు.


