News July 6, 2024

ఒక్కసారైనా WC గెలిచావా?.. వాన్‌కు రవిశాస్త్రి కౌంటర్

image

T20 WC నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు రవిశాస్త్రి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ‘వాన్ ఇష్టమొచ్చింది మాట్లాడొచ్చు. కానీ ఆయన మాటలను ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. సెమీస్‌లో ఇంగ్లండ్ ఎందుకు విఫలమైందో ముందుగా దానిపై దృష్టి పెడితే బెటర్. వాన్ తన కెరీర్‌లో ఒక్క సారి కూడా ప్రపంచకప్ సాధించలేకపోయారు. అలాంటి వ్యక్తి భారత్‌ను తప్పుబట్టడం ఏంటి?’ అని రవి వ్యాఖ్యానించారు.

Similar News

News October 14, 2024

ఎల్లుండి బ్రేక్ దర్శనాలు రద్దు: TTD

image

తిరుమలలో ఈ నెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రాగల 48 గంటల్లో భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ అంచనాలతో భక్తుల భద్రత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 15న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని వెల్లడించింది.

News October 14, 2024

‘INDIA’ కోసం రంగంలోకి సునీల్ క‌నుగోలు

image

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో INDIA కూట‌మి గెలుపు కోసం వ్యూహకర్త సునీల్ క‌నుగోలు రంగంలోకి దిగారు. హ‌రియాణాలో జాట్ల ఓట్ల స‌మీక‌ర‌ణ క్ర‌మంలో మిగతా వ‌ర్గాలు దూర‌మ‌వ్వ‌డం కాంగ్రెస్ కొంపముంచింది. దీంతో MHలో అందరికీ స‌మ ప్రాధాన్యం ఇవ్వడం సహా, అసంతృప్తి నేత‌ల‌ను మ‌చ్చిక చేసుకొనే వ్యూహాలను పార్టీ ముందుంచినట్టు తెలిసింది. హరియాణాలో కాంగ్రెస్ రెబల్స్‌కు BJP సహకరించడం వల్లే ఓడిపోయామని కాంగ్రెస్ భావిస్తోంది.

News October 14, 2024

సంగీతంతో మొక్కలు వేగంగా పెరుగుతాయ్!

image

సంగీతానికి రాళ్లు కరిగించే శక్తి ఉంటుందంటారు. అదే సంగీతం మొక్కలను వేగంగా పెరిగేలా చేస్తుందనే విషయాన్ని పరిశోధకులు నిరూపించారు. మ్యూజిక్ ప్లే చేయడం ద్వారా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే ఫంగస్‌ కార్యాచరణను ప్రేరేపించవచ్చని తేలింది. శిలీంధ్రాలున్న పాత్రల చుట్టూ సౌండ్ బూత్‌లను అమర్చి పరీక్షించారు. 5 రోజుల తర్వాత శిలీంధ్రాలలో పెరుగుదల& బీజాంశం ఉత్పత్తిలో వేగం కనిపించింది.