News July 6, 2024

ఒక్కసారైనా WC గెలిచావా?.. వాన్‌కు రవిశాస్త్రి కౌంటర్

image

T20 WC నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు రవిశాస్త్రి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ‘వాన్ ఇష్టమొచ్చింది మాట్లాడొచ్చు. కానీ ఆయన మాటలను ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. సెమీస్‌లో ఇంగ్లండ్ ఎందుకు విఫలమైందో ముందుగా దానిపై దృష్టి పెడితే బెటర్. వాన్ తన కెరీర్‌లో ఒక్క సారి కూడా ప్రపంచకప్ సాధించలేకపోయారు. అలాంటి వ్యక్తి భారత్‌ను తప్పుబట్టడం ఏంటి?’ అని రవి వ్యాఖ్యానించారు.

Similar News

News December 10, 2024

రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

image

ప్రస్తుత బిజీ లైఫ్‌లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.

News December 10, 2024

అమెరికా వారికి ఆశ్రయం: భార‌త్‌

image

భార‌త్‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ప్ర‌తి ముగ్గురు నేర‌స్థులు, ఉగ్ర‌వాదుల్లో ఒక‌రు అమెరికాలో తలదాచుకుంటున్నార‌ని, ఆగ్ర‌రాజ్యం వారికి ఆశ్రయంగా మారింద‌ని కేంద్ర హోం శాఖ పేర్కొంది. వీరి అప్ప‌గింత‌ కోసం భార‌త‌ దర్యాప్తు సంస్థలు చేసిన 178 పెండింగ్ అభ్య‌ర్థ‌న‌ల్లో 65 ప్ర‌స్తుతం US ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలిపింది. 2002-18 మ‌ధ్య 11 అభ్య‌ర్థ‌న‌ల‌కే US స‌మ్మ‌తించినట్టు పేర్కొంది.

News December 10, 2024

‘మంచు’లా కరిగిన మోహన్ బాబు ఇంటి పరువు

image

50 ఏళ్ల సినీ ప్రస్థానం, 500కు పైగా సినిమాలు, అద్భుతమైన MBU యూనివర్సిటీ, MP, పద్మశ్రీ, ఎన్నో అవార్డులు, డైలాగ్ కింగ్ ఇవన్నీ మోహన్ బాబు పేరు చెప్తే ఇప్పటివరకు గుర్తొచ్చేవి. కానీ కుమారుడు మంచు మనోజ్‌తో గొడవ అంశంతో మంచు ఫ్యామిలీ పరువు మంచులా కరిగిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా 4 గోడల మధ్య పూర్తికావాల్సిన ఆస్తి వ్యవహారం వివాదాలతో బిగ్‌బాస్ హౌస్‌లా బయటకొచ్చింది. ఈ ఘటన మంచు ఫ్యామిలీకి మచ్చగా మిగిలింది.