News July 8, 2024
నేడు విజయవాడకు సీఎం రేవంత్, మంత్రులు

TG: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75వ జయంతి సభకు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Similar News
News March 11, 2026
రాష్ట్ర ప్రజలకు CM ఉగాది కానుక

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు ఉగాది కానుక ప్రకటించారు. ఉగాది రోజున 2.50 లక్షల మంది లబ్ధిదారుల సామూహిక నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫు నుంచి అధికారిక లేఖ వెళ్లేలా చూడాలని ఆదేశించారు. కాగా 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు.
News March 11, 2026
చిన్న సంస్థ.. పెద్ద దెబ్బ: అమెరికా యుద్ధ రహస్యాలు లీక్

చైనాకు చెందిన మిజార్‌విజన్ అనే చిన్న సంస్థ AI సాయంతో అమెరికా యుద్ధ వ్యూహాలను బట్టబయలు చేసింది. ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభానికి ముందే ఇజ్రాయెల్, సౌదీలోని అమెరికా వైమానిక స్థావరాలు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల హై-రిజల్యూషన్ ఫొటోలను ఈ సంస్థ SMలో విడుదల చేసింది. జిలిన్-1 ఉపగ్రహాల ద్వారా సేకరించిన ఈ సమాచారం ఇరాన్ దాడులకు పరోక్షంగా సహకరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
News March 11, 2026
శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.


