News July 8, 2024
ఉచిత ఇసుకపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
AP: ఉచిత ఇసుకపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో SP, JC, వివిధ శాఖల అధికారులు ఉంటారు. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీల బాధ్యతను జిల్లా కమిటీలే పర్యవేక్షిస్తాయి. ఇసుకను తిరిగి అమ్మినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలకు మాత్రమే వాడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Similar News
News January 19, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో నా ఫేవరెట్ టీమ్ పాక్: గవాస్కర్
ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో తన ఫేవరెట్ టీమ్ పాకిస్తాన్ అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పారు. స్వదేశంలో పాక్‌ను ఓడించడం అంత సులువు కాదని తెలిపారు. స్వదేశంలో ఆడటం ఆ జట్టుకు కలిసొస్తుందన్నారు. గత వరల్డ్‌కప్ ఫైనల్లో అతిథ్య భారత జట్టు ఓడినా టోర్నీ మొత్తం అదిరిపోయే ప్రదర్శన చేసిందని గుర్తు చేశారు. CTకి పాకిస్తాన్, యూఏఈ అతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
News January 19, 2025
నేటి నుంచి కొమురవెల్లి జాతర
TG: నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న జాతర మొదలవనుంది. 2 నెలల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నుంచి ఉగాది ముందు వచ్చే ఆదివారం వరకు ఈ జాతర జరగనుంది. ఇవాళ తొలి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు బోనాలు, పట్నాలతో స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు.
News January 19, 2025
బిహార్‌లో కూటమిగా పోటీ: రాహుల్ గాంధీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. పాట్నాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. INDIA కూటమి ఐక్యతతో బీజేపీ, ఆరెస్సెస్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లోక్‌సభ ఎన్నికల వరకే కూటమి పరిమితమని పేర్కొనగా తాజాగా రాహుల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.