News January 19, 2025
బిహార్‌లో కూటమిగా పోటీ: రాహుల్ గాంధీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. పాట్నాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. INDIA కూటమి ఐక్యతతో బీజేపీ, ఆరెస్సెస్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లోక్‌సభ ఎన్నికల వరకే కూటమి పరిమితమని పేర్కొనగా తాజాగా రాహుల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Similar News
News February 16, 2025
మిస్డ్ కాల్‌కు తిరిగి కాల్ చేస్తే అంతే సంగతులు

గుర్తుతెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే ఎట్టిపరిస్థితుల్లో తిరిగి కాల్ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. +371(5), +381 (2) నంబర్ల నుంచి కాల్ చేసి #90 లేదా #09 డయల్ చేయమని అడిగితే ఎట్టిపరిస్థితుల్లో చేయొద్దన్నారు. అలా చేస్తే నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తారన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930ను సంప్రదించాలన్నారు.
News February 16, 2025
నీతా అంబానీకి అరుదైన గౌరవం

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. దార్శనికత, దాతృత్వం, సామాజిక సేవలతో గ్లోబల్ ఛేంజ్‌మేకర్‌గా నిలుస్తున్నారని USAలోని మసాచుసెట్స్ ప్రభుత్వం కొనియాడింది. విద్య, ఆరోగ్యం, స్పోర్ట్స్, తదితర రంగాల్లో ఆమె సేవలు గొప్పవని పేర్కొంది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక ‘గవర్నర్ ప్రశంసాపత్రం’ అందజేసింది. బోస్టన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ హీలీ అవార్డ్ అందజేసినట్లు నీతా అంబానీ ఆఫీస్ తెలిపింది.
News February 16, 2025
BIG BREAKING: IPL-2025 షెడ్యూల్ వచ్చేసింది

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2025 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి 65 రోజులపాటు మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. తొలి మ్యాచ్ KKR-RCB మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహిస్తారు. 13 వేదికల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. IPL షెడ్యూల్ కోసం ఇక్కడ <