News July 10, 2024

గంగాపూర్: అంబులెన్స్‌లో ప్రసవం..

image

హవేలి ఘనపూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మన్నె మల్లేశం భార్య కల్పనకు పురిటి నొప్పులు రాగా అంబులెన్స్‌కు సమాచారం తెలిపారు. మెదక్ MCH ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ కాగా EMT శ్రీహరి డెలివరీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. వారిని మెదక్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు పేర్కొన్నారు. పైలెట్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 12, 2026

మెదక్: ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్ త్వరితగతిన పూర్తి చేయాలి’

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News January 12, 2026

మెదక్: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

image

కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సమస్యల పరిష్కారానికి సమర్థంగా ఉపయోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 44 అర్జీలను స్వీకరించారు. ఇందులో భూభారతి-32, పెన్షన్-2, ఇందిరమ్మ ఇళ్లు-2, ఇతర సమస్యలపై- 9 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News January 12, 2026

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: కలెక్టర్

image

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వివేకానంద జయంతి వేడుకల్లో భాగంగా చిత్రపటానికి నివాళులర్పించారు. యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.