News July 10, 2024
పీసీబీ దస్త్రాల దహనంపై పోలీసుల విచారణ

AP: కృష్ణా జిల్లా పెనమలూరులో పీసీబీ దస్త్రాల దహనం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విజయవాడ పీసీబీ ప్రధాన కార్యాలయంలో 7 విభాగాల అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయం నుంచి ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు బయటకు వెళ్లడంలో అధికారుల పాత్రపై విచారిస్తున్నారు. కాల్చిన దస్త్రాల్లోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై ఆరా తీస్తున్నారు. సిబ్బంది ఇస్తున్న సమాచారాన్ని వాంగ్మూలంగా నమోదు చేస్తున్నారు.
Similar News
News January 1, 2026
జీవన్‌దాన్ ద్వారా వారి జీవితంలో కొత్త వెలుగులు

రాష్ట్ర వైద్యరంగంలో మరో సరికొత్త రికార్డు నమోదయింది. 301 మందికి జీవన్‌దాన్ (అవయవ దానం) ద్వారా జీవితాల్లో వెలుగులు నింపారు. 2015 నుంచి ఇప్పటివరకు 1293 అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు అందించామని విమ్స్ డైరెక్టర్ జీవన్‌దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కే.రాంబాబు తెలిపారు. జీవన్‌దాన్ చేస్తున్న సేవలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ అభినందించారు.
News January 1, 2026
విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

AP: న్యూఇయర్ వేళ నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. తుడుములదిన్నె గ్రామంలో ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్యగగన్(2)కు విషమిచ్చి సురేందర్(35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలను పెంచే స్తోమత లేక సురేంద్ర ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది సురేంద్ర భార్య మహేశ్వరి(32) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.
News January 1, 2026
పండగకు, జాతరకు స్పెషల్ బస్సులు.. ఛార్జీల పెంపు!

TG: సంక్రాంతికి, మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా RTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతికి HYD నుంచి ఈ నెల 9-13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అటు మేడారం జాతరకు ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నుంచే 3,495 స్పెషల్ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ టికెట్ ఛార్జీలు, ప్రత్యేక బస్సుల్లో 50% మేర పెంపు ఉంటాయన్నారు.


