News July 10, 2024
పీసీబీ దస్త్రాల దహనంపై పోలీసుల విచారణ
AP: కృష్ణా జిల్లా పెనమలూరులో పీసీబీ దస్త్రాల దహనం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విజయవాడ పీసీబీ ప్రధాన కార్యాలయంలో 7 విభాగాల అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కార్యాలయం నుంచి ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు బయటకు వెళ్లడంలో అధికారుల పాత్రపై విచారిస్తున్నారు. కాల్చిన దస్త్రాల్లోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై ఆరా తీస్తున్నారు. సిబ్బంది ఇస్తున్న సమాచారాన్ని వాంగ్మూలంగా నమోదు చేస్తున్నారు.
Similar News
News October 12, 2024
20 నియోజకవర్గాల్లో అక్రమాలు: జైరాం రమేశ్
హరియాణా ఎన్నికల ఫలితాల విషయంలో తాము లేవనెత్తిన అభ్యంతరాలపై EC విచారణ జరుపుతుందని భావిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా 20 స్థానాల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. కౌంటింగ్‌కి ఉపయోగించిన EVMలు, వాటి బ్యాటరీ సామర్థ్యాలపై కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారని, అక్రమాలు జరిగిన EVMలను సీల్ చేయాల్సిందిగా ఆయన కోరారు.
News October 12, 2024
అక్టోబర్ 12: చరిత్రలో ఈ రోజు
1911: భారత మాజీ క్రికెటర్ విజయ మర్చంట్ జననం
1918: తెలుగు సినీ నిర్మాత రామకృష్ణారావు జననం
1946: భారత మాజీ క్రికెటర్ అశోక్ మన్కడ్ జననం
1967: సోషలిస్ట్ నాయకుడు రామ్‌మనోహర్ లోహియా మరణం
1981: నటి స్నేహ జననం
News October 12, 2024
బాలకృష్ణ సరసన ఐశ్వర్యరాయ్?
నందమూరి బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్లు టాక్. కాగా నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో బాలయ్య కూడా నటిస్తున్నారని, ఇందులోనే ఆయన సూపర్ హీరోగా కనిపిస్తారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.