News July 11, 2024

మావోయిస్టులపై నిఘాకు యూఏవీ

image

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టులపై నిఘా వేసేందుకు మానవరహిత గగనతల వాహనాలను(UAV) వినియోగించాలని భద్రతాబలగాలు భావిస్తున్నాయి. ఇవి 200 కిలోమీటర్ల పరిధిలో నిఘా వేయగలవని అంచనా. వీటితో మావోయిస్టుల కదలికలపై పూర్తి అంచనా వస్తుందని చెబుతున్నారు. యూఏవీ సమాచారం సరాసరి సెంట్రల్ మానిటర్ రూమ్స్‌కు చేరుకుంటుందని, వాటి ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు వివరిస్తున్నారు.

Similar News

News January 19, 2025

వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం

image

TG: మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే మరుసటి ఏడాది నిర్వహించే మండమెలిగె పండుగను మినీ మేడారంగా భక్తులు పిలుస్తారు. వచ్చే నెల 12 నుంచి 15 వరకు ఈ జాతర జరగనుంది. దీని కోసం రూ.32 కోట్లతో అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

News January 19, 2025

బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!

image

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో తేలిగ్గా అర్థం చేసుకునే విధంగా ఈ ప్రతిపాదిత బిల్లు ఉండనుంది. ప్రస్తుత చట్టంలో 298 సెక్షన్లు, 23 చాప్టర్లు ఉన్నాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.

News January 19, 2025

ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లు తాగితే..

image

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు చురుగ్గా మారి రక్త ప్రసరణ వ్యవస్థ వేగవంతం అవుతుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, కఫం సమస్యలు తొలగిపోతాయి. ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి చర్మంపై ముడతలు తగ్గుతాయి.
SHARE IT