News July 11, 2024
మావోయిస్టులపై నిఘాకు యూఏవీ

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టులపై నిఘా వేసేందుకు మానవరహిత గగనతల వాహనాలను(UAV) వినియోగించాలని భద్రతాబలగాలు భావిస్తున్నాయి. ఇవి 200 కిలోమీటర్ల పరిధిలో నిఘా వేయగలవని అంచనా. వీటితో మావోయిస్టుల కదలికలపై పూర్తి అంచనా వస్తుందని చెబుతున్నారు. యూఏవీ సమాచారం సరాసరి సెంట్రల్ మానిటర్ రూమ్స్‌కు చేరుకుంటుందని, వాటి ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు వివరిస్తున్నారు.
Similar News
News February 19, 2025
బ్యాక్టీరియా లేదు.. ఆ నీటిని తాగొచ్చు: యోగి

UP ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలో బ్యాక్టీరియా ఉందన్న వార్తలను సీఎం యోగి ఆదిత్యనాథ్ కొట్టిపారేశారు. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఆ చోటు పవిత్రమైందని.. ఆ నీళ్లను తాగొచ్చని చెప్పారు. సనాతన ధర్మం, గంగామాతపై ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని ఫైరయ్యారు. కాగా జనవరి 12, 13 తేదీల్లో మహాకుంభమేళా నీటిని పరిశీలించిన CPCB.. అందులో బ్యాక్టీరియా ఉందని, స్నానానికి పనికిరావని NGTకి నివేదిక ఇచ్చింది.
News February 19, 2025
‘ఐదుగురు స్పిన్నర్లెందుకు?’.. రోహిత్ స్ట్రాంగ్ రిప్లై

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ఐదుగురు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ జవాబిచ్చారు. ‘మీకు ఐదుగురు స్పిన్నర్లు కనిపిస్తున్నారు. కానీ నాకు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు కనిపిస్తున్నారు. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వల్ల బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అవుతుంది’ అని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ తమకెంతో ముఖ్యమని తెలిపారు.
News February 19, 2025
KCR పగటి కలలు కంటున్నారు: మంత్రి

TG: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని <<15513169>>KCR<<>> పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 14 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎలా కనపడుతుందని ప్రశ్నించారు. ‘KCRకు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు. ప్రజలు కష్టపడి ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రజా తీర్పును గౌరవించలేదు. అసెంబ్లీ వైపు రాలేదు’ అని విమర్శించారు.