News July 11, 2024

అనర్హుల నుంచి రికవరీ చేయాలని డిమాండ్!

image

మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ రైతు పొందిన రూ.16 లక్షల రైతుబంధు సాయాన్ని <<13606676>>రికవరీ<<>> చేసేందుకు రెవెన్యూశాఖ సిద్ధమవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ భూమి కానప్పటికీ రైతుబంధు సాయం పొందిన వారెందరో ఉన్నారని, వారిని గుర్తించి రికవరీ చేసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 20-100 ఎకరాలున్న వారు పేదరైతులెలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. చిన్నకారు, కౌలు రైతులకు సాయం చేయాలని కోరుతున్నారు. మీరేమంటారు?

Similar News

News October 24, 2025

‘SI రేప్ చేశాడు’.. వైద్యురాలి చేతిపై సూసైడ్ నోట్

image

మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య సంచలనంగా మారింది. SI తనను రేప్ చేశాడంటూ చేతిపై సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. ‘నా చావుకు SI గోపాల్ కారణం. గత 5 నెలల నుంచి నాలుగుసార్లు రేప్ చేశాడు. ఫిజికల్‌గా, మెంటల్‌గా నన్ను వేధిస్తున్నాడు’ అని పేర్కొన్నారు. గోపాల్‌తో పాటు మరో పోలీస్ వేధిస్తున్నాడని 3 నెలల క్రితమే DSPకి ఆమె లేఖ రాయడం గమనార్హం. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు.

News October 24, 2025

భార్య చేసే పూజా ఫలితాలు భర్తకు దక్కుతాయా?

image

‘భర్త ఓ పుణ్య కార్యం చేస్తే.. ఆ పుణ్యం భార్యకు దక్కుతుంది. కానీ పాప కార్యంలో పాపం మాత్రం ఆమెకు అంటదు. అలాగే భార్య పూజలెన్ని చేసినా ఆ ఫలితం భర్తకు దక్కదు’ అని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. భర్త తను చేసే తప్పులకు భార్య చేసే పూజలతో విముక్తి కలుగుతుందని అనుకొనే అవకాశాలుంటాయి. ఇంటి పెద్దైన భర్త అలాంటి తప్పులు చేయకూడదనే ఈ నియమాన్ని పెట్టారు. భార్య చేసే పూజల్లో తోడుంటేనే భర్తకు కూడా ఆ ఫలితం దక్కుతుంది.

News October 24, 2025

విమానాల మాదిరి AC బస్సుల్లోనూ చెప్పాలా?

image

విమానం బయల్దేరే ముందు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల గురించి ఫ్లైట్ క్రూ వివరిస్తారు. అలాగే AC బస్సుల్లోనూ ఎమర్జెన్సీ డోర్‌ల గురించి చెబితే కర్నూలు లాంటి ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బస్సులో కింద సీట్లలోని వారు తప్పించుకోవడానికి కొంత ఛాన్స్ ఉన్నా, పైసీట్లలోని వారు డోర్ ద్వారా బయటకు రావడం కష్టం. అందుకే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.