News July 11, 2024
అనర్హుల నుంచి రికవరీ చేయాలని డిమాండ్!

మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ రైతు పొందిన రూ.16 లక్షల రైతుబంధు సాయాన్ని <<13606676>>రికవరీ<<>> చేసేందుకు రెవెన్యూశాఖ సిద్ధమవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ భూమి కానప్పటికీ రైతుబంధు సాయం పొందిన వారెందరో ఉన్నారని, వారిని గుర్తించి రికవరీ చేసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 20-100 ఎకరాలున్న వారు పేదరైతులెలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. చిన్నకారు, కౌలు రైతులకు సాయం చేయాలని కోరుతున్నారు. మీరేమంటారు?
Similar News
News February 19, 2025
హైఅలర్ట్.. సరిహద్దుల్లో మరోసారి అలజడి

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో కూంబింగ్ చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
News February 19, 2025
చరిత్రలోనే పెద్ద మోసం: మస్క్

అమెరికా సామాజిక భద్రతా విభాగంలో డేటాబేస్ పూర్తిగా తప్పని, ‘చరిత్రలోనే ఇది పెద్ద మోసమని’ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100సంవత్సరాల పైబడినవారు 2కోట్లమంది, 200ఏళ్లు దాటిన వారు 2వేలమంది. 369 సంవత్సరాల వ్యక్తి జీవించి ఉన్నట్లు డేటాబేస్ ఉందని తెలిపారు. మరణించిన వారి సమాచారం (SSA)లో నమోదు చేయకపోవడంతో ఈసమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల ప్రకారం 100ఏళ్లు దాటిన వారు 86వేలు ఉన్నట్లు తెలిపారు.
News February 19, 2025
VIRAL: అమ్మాయిల ఇన్‌స్టా స్టోరీ పోస్ట్

ఓ యువతీయువకుడు సంతోషంగా కలిసున్నప్పుడు, తర్వాత ఆ యువతి తీవ్రంగా గాయపడ్డ ఫొటోల పోస్ట్ ఒకటి ఇన్‌స్టాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దానికి ‘డియర్ గర్ల్స్. మీ ఫ్యూచర్ పార్ట్‌నర్‌ని మనసు, వ్యక్తిత్వం చూసి ఎంచుకోండి కానీ ముఖం, డబ్బు చూసి కాదు’ అని క్యాప్షన్ రాశారు. అబ్బాయి అందం, డబ్బు చూసి మోసపోయిన అమ్మాయి చివరికి ఇలా బాధపడాల్సి వస్తుందని అర్థమొచ్చే ఈ పోస్ట్‌ను చాలామంది అమ్మాయిలు స్టోరీగా పెట్టుకున్నారు.