News July 11, 2024
75% హాజరు ఉంటేనే రూ.15,000.. జీవో విడుదల

AP: ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేల సాయం అందిస్తామని పేర్కొంది. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది. గత ప్రభుత్వంలో ‘అమ్మఒడి’గా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీయే సర్కారు ‘తల్లికి వందనం’గా మార్చింది.
Similar News
News July 9, 2025
HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసింది. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా అదనంగా మరో 10శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని SRH యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో విజిలెన్స్ <<16524630>>రిపోర్టు<<>> ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది.
News July 9, 2025
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

TG: తమ రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని సీఎం రేవంత్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై కేంద్ర ఎరువులశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ‘తెలంగాణలో యూరియా కొరత లేకుండా చేస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని జిల్లాలకు యూరియాను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో కాస్త యూరియా వాడకం తగ్గిస్తే భూసారం దెబ్బతినకుండా ఉంటుంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
News July 9, 2025
BRS వల్లే కృష్ణా జలాల్లో TGకి అన్యాయం: మంత్రి ఉత్తమ్

TG: BRS హయాంలోనే రాయలసీమకు కృష్ణా నీటిని అక్రమంగా తరలించే ఏర్పాట్లు జరిగాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ‘కల్వకుర్తి, నెట్టెంపాడు, SLBC, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను BRS పూర్తి చేయలేదు. కృష్ణా జలాల్లో TGకి 299 TMCలు చాలని KCR ఒప్పుకున్నారు. APకి 512 TMCలు ఇచ్చేందుకు అంగీకరించారు. మా ప్రభుత్వం వచ్చాకే TGకి 578 TMCలు కావాలని అపెక్స్ కౌన్సిల్‌ను కోరాం’ అని కృష్ణా జలాలపై ప్రజెంటేషన్‌లో వివరించారు.