News July 11, 2024
75% హాజరు ఉంటేనే రూ.15,000.. జీవో విడుదల

AP: ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేల సాయం అందిస్తామని పేర్కొంది. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది. గత ప్రభుత్వంలో ‘అమ్మఒడి’గా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీయే సర్కారు ‘తల్లికి వందనం’గా మార్చింది.
Similar News
News February 19, 2025
ఆ సంఘటన తర్వాత మారిపోయా: హీరోయిన్

తన జీవితంలో ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నట్లు హీరోయిన్ నభా నటేశ్ తెలిపారు. ప్రమాదం తర్వాత మామూలు స్థితికి వచ్చేందుకు చాలా శ్రమించినట్లు చెప్పారు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. దీని వల్ల వర్కౌట్స్ విషయంలో తన ధోరణి మారిందన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నారు.
News February 19, 2025
‘బుక్’ పాలిటిక్స్

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు TDP జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేశ్ ‘రెడ్’ బుక్ మెయింటేన్ చేస్తున్నామని ప్రకటించారు. తమను ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న BRS MLC కవిత కూడా ఇటీవల ‘పింక్’ బుక్ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా BJP MP ఈటల ‘కాషాయ’ బుక్ మెయింటేన్ చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై మీ కామెంట్?
News February 19, 2025
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి నకిలీ పోలీస్

TG: కానిస్టేబుల్‌ని అంటూ ఓ వ్యక్తి పోలీస్ కమాండ్ కంట్రోల్‌లోకి ప్రవేశించాడు. గోవర్ధన్ అనే అతను కానిస్టేబుల్ అని చెప్పి జ్ఞాన సాయి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.3లక్షలు తీసుకున్నాడు. అతణ్ని నమ్మించడానికి CM సమీక్ష జరుగుతున్నప్పుడే CCCలోకి వెళ్లి వచ్చాడు. ఆపై అతను కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు CCTV ఫుటేజ్ పరిశీలించగా నిందితుడి చిత్రాలు నమోదయ్యాయి.