News July 11, 2024
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ముగిశాయి. ఓ దశలో 400కుపైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ క్రమంగా కోలుకుంది. 79,897 (-27) వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. మరోవైపు నిఫ్టీ సైతం నష్టాల నుంచి కోలుకుని 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 24,315 వద్ద స్థిరపడింది. ONGC, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది.
Similar News
News February 7, 2026
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ట్రంప్ డెడ్‌లైన్

రష్యాతో తమ యుద్ధాన్ని జూన్ నాటికి ముగించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డెడ్‌లైన్ విధించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. అందుకోసం వచ్చేవారం మరో దఫా చర్చలు జరిపేందుకు ఇరు పక్షాలనూ USకు ఆహ్వానించినట్లు చెప్పారు. దానికి తాను సమ్మతించినట్లు వెల్లడించారు. రష్యా స్టాండ్ ఏంటనేది మాత్రం తెలియదన్నారు. అబుదాబీలో ఇటీవల ముగిసిన చర్చల్లో కొన్ని కీలక అంశాలపై సయోధ్య కుదరలేదని వెల్లడించారు.
News February 7, 2026
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న USA

T20WC: వాంఖడే వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో అమెరికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా ఈ మ్యాచుకు దూరమైనట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు.
IND: అభిషేక్, ఇషాన్, తిలక్, రింకూ, సూర్య(C), హార్దిక్, దూబే, అక్షర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్, సిరాజ్.
News February 7, 2026
మంత్రాలు చదవాలా, ఉచ్ఛరించాలా?

బుద్ధిని పెంచుకోవడానికి ‘గ్రంథాలు’ చదవాలి. ఏకాగ్రత, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ నింపడానికి స్తోత్రాలు ‘పఠించాలి’. అనుకున్న ఫలితం సిద్ధించాలంటే అక్షర దోషం లేకుండా మంత్రాన్ని ‘ఉచ్ఛరించాలి’. దేవునితో అనుబంధాన్ని, శరణాగతిని పొందాలంటే ఆయన గుణాలను ‘స్తుతించాలి’. ఎలాంటి ఆడంబరాలు లేకుండా ప్రేమతోనే ఆయన నామాన్ని ‘పలకాలి’. తద్వారా దైవ సాన్నిధ్యాన్ని సులభంగా పొందవచ్చు. ఇవన్నీ కలిస్తేనే పరిపూర్ణమైన భక్తి సాధ్యం.


