News July 11, 2024
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ముగిశాయి. ఓ దశలో 400కుపైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ క్రమంగా కోలుకుంది. 79,897 (-27) వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. మరోవైపు నిఫ్టీ సైతం నష్టాల నుంచి కోలుకుని 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 24,315 వద్ద స్థిరపడింది. ONGC, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది.
Similar News
News February 9, 2025
రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు: ఈసీ

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఈసీ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.
News February 9, 2025
ఫోన్ స్క్రీన్ టైమ్ ఇలా తగ్గించుకోండి!

* అనవసరమైన యాప్‌ల నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి.
* 30minకి ఒకసారి స్క్రీన్ బ్రేక్ తీసుకోండి. వారంలో ఒక రోజు ఫోన్ వాడకండి.
* బుక్స్ చదవడం, వ్యాయామం, పెయింటింగ్ వంటివి చేయండి
* బాత్రూమ్, బెడ్ రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్లొద్దు
* ఫోన్ వాడకాన్ని తగ్గిస్తున్నట్లు మీ ఫ్రెండ్స్‌కు చెప్పండి. మెసేజ్‌లకు లేట్‌గా రిప్లై ఇచ్చినా ఏం కాదు
* ఫోన్ ఎక్కువగా వాడొద్దన్న విషయాన్ని పదే పదే గుర్తుచేసుకోండి.
News February 9, 2025
బంగ్లాదేశ్‌లో హిందువులపై 2 నెలల్లో 76 దాడులు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 26, 2024 నుంచి జనవరి 25, 2025 వరకు బంగ్లాలో హిందువులపై మొత్తం 76 దాడులు జరిగాయని పార్లమెంటులో వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 23 మంది హిందువులు చనిపోయారని, 152 దేవాలయాలపైనా దాడులు జరిగినట్లు పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.