News July 12, 2024
రత్న భాండాగారం.. అధికారులకు ‘సర్పాల’ భయం
ఒడిశాలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయంలోని రహస్య గదిని తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ గదిని తెరిచే అధికారులను సర్పాల భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా స్నేక్ క్యాచర్స్, డాక్టర్లను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ నెల 14న రత్న భాండాగారం తెరవనున్నారు. 1978 తర్వాత ఇంతవరకూ ఆ రహస్య గదిని తెరవలేదు. ఐదు చెక్క పెట్టెల్లో వెలకట్టలేని విలువైన ఆభరణాలు ఉన్నట్లు సమాచారం.
Similar News
News January 19, 2025
Debate: తమ్ముళ్ల ఆలోచన అదేనా..?
లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలనే TDP డిమాండ్పై నెట్టింట డిబేట్ అవుతోంది. గతంలో కీలక మంత్రిగా, ప్రతిపక్షంలో పాదయాత్రతో జనాల్లోకి వెళ్లిన ఆయన ఈ పదవికి అర్హుడని TDP అంటోంది. కానీ ఇది పవన్ను కంట్రోల్ చేసే స్టెప్ అనేది జనసేన వర్షన్. చంద్రబాబు సైతం కంట్రోల్ చేయలేకపోతున్న పవన్ను బ్యాలెన్స్ చేయాలంటే లోకేశ్ No.2గా ఉండాలనేది తెలుగు తమ్ముళ్ల ఆలోచన అంటున్నారు. మరి నిజంగానే క్యాడర్ కోరికనా? కట్టడి ప్రయత్నమా?
News January 19, 2025
జుట్టు బాగా రాలుతోందా..? ఇలా చేశారంటే..
– మీ చర్మం, జుట్టుకు ఏ తరహా షాంపూ/ప్రొడక్ట్ సెట్ అవుతుందో డాక్టర్తో తెలుసుకుని వాటిని వాడటం బెటర్
– రోజూ తలస్నానం చేస్తే కుదుళ్లు పొడిగా మారి వెంట్రుకలు రాలుతాయి. చెమట, పనిని బట్టి వారానికి 2-3సార్లు తలస్నానం మంచిది.
– జడ/జుట్టు బంధించినట్లు కాకుండా కాస్త వదులుగా ఉంచితే రక్త ప్రసరణ సులువై వెంట్రుకలు బలంగా ఉంటాయి
– ఎక్కువ కాలం హెయిర్ డ్రయర్ వాడవద్దు
– ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా జుట్టు రాలుతుంది
News January 19, 2025
కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
AP: సంక్రాంతి సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారంతా తిరుగుపయనం అవుతున్నారు. సోమవారం నుంచి స్కూళ్లు, ఆఫీస్లు ఉండటంతో ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. పండగ నేపథ్యంలో విజయవాడ నుంచి 133 అదనపు బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.