News July 12, 2024

రత్న భాండాగారం.. అధికారులకు ‘సర్పాల’ భయం

image

ఒడిశాలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయంలోని రహస్య గదిని తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ గదిని తెరిచే అధికారులను సర్పాల భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా స్నేక్ క్యాచర్స్, డాక్టర్లను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ నెల 14న రత్న భాండాగారం తెరవనున్నారు. 1978 తర్వాత ఇంతవరకూ ఆ రహస్య గదిని తెరవలేదు. ఐదు చెక్క పెట్టెల్లో వెలకట్టలేని విలువైన ఆభరణాలు ఉన్నట్లు సమాచారం.

Similar News

News February 8, 2025

బిడ్డకు జన్మనిచ్చిన కమిన్స్ భార్య

image

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘ఈదీ’ అని పేరు పెట్టినట్లు కమిన్స్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. కమిన్స్, బెకీ దంపతులకు ఇప్పటికే ఆల్బీ ఓ కూతురు ఉంది. మరోవైపు భార్య డెలివరీ నేపథ్యంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌‌కు కమిన్స్ దూరమయ్యారు. అటు గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు పాల్గొనడం లేదు.

News February 8, 2025

చంద్రబాబు ప్రచారం చేసిన చోట్ల BJPకి ఆధిక్యం

image

AP సీఎం చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రచారం కలిసొస్తుందని బీజేపీ అధిష్ఠానం భావించి ఆహ్వానించింది. ఆ పార్టీ ఆశించినట్లే చంద్రబాబు ప్రచారం వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.

News February 8, 2025

ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు రేవంత్ రెడ్డీ?: హరీశ్ రావు

image

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.

error: Content is protected !!