News July 12, 2024
నేను టెన్నిస్ ఎంచుకుని ఉంటే బాగుండేది: సైనా

తాను బ్యాడ్మింటన్‌కు బదులు టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఉంటే మరిన్ని ఘనతలు సాధించి ఉండేదాన్నని భారత షట్లర్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడ్డారు. ‘మా పేరెంట్స్ నన్ను టెన్నిస్‌లో చేర్చి ఉంటే బాగుండేదని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. టెన్నిస్‌లో ఎక్కువ డబ్బు ఉంటుంది. బ్యాడ్మింటన్ ప్రారంభించినప్పుడు నాకు ఆదర్శం ఎవరూ లేరు. ఎందుకంటే నేను సాధించినవి అప్పటికి ఎవరూ అందుకోలేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2026
‘లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం’

AP: తిరుపతి(D) పుత్తూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న పద్మ అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి భర్త నిరుద్యోగం, అప్పుల భారమే కారణంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో “తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం. లవ్ మ్యారేజీ చేసుకున్న పాపానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
News February 8, 2026
జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల బిడ్డకు ఈ సమస్యలు

గర్భంలో ఉన్న శిశువుకి, తల్లి మాయ నుంచి గ్లూకోజ్ ఎక్కువగా అందుతుంటుంది. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి వచ్చే చక్కెర అకస్మాత్తుగా ఆగిపోవడంతో బిడ్డలో చక్కెర మోతాదులు హఠాత్తుగా పడిపోయి చిన్నారి చల్లబడిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు, ఫిట్స్ రావడం, సకాలంలో గమనించకపోతే బిడ్డ మృతిచెందే అవకాశాలుంటాయి. కార్డియోమయోపతి, స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
News February 8, 2026
NPCIL 30 పోస్టులకు నోటిఫికేషన్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<


