News July 12, 2024

నేను టెన్నిస్ ఎంచుకుని ఉంటే బాగుండేది: సైనా

image

తాను బ్యాడ్మింటన్‌కు బదులు టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకుని ఉంటే మరిన్ని ఘనతలు సాధించి ఉండేదాన్నని భారత షట్లర్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడ్డారు. ‘మా పేరెంట్స్ నన్ను టెన్నిస్‌లో చేర్చి ఉంటే బాగుండేదని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. టెన్నిస్‌లో ఎక్కువ డబ్బు ఉంటుంది. బ్యాడ్మింటన్‌ ప్రారంభించినప్పుడు నాకు ఆదర్శం ఎవరూ లేరు. ఎందుకంటే నేను సాధించినవి అప్పటికి ఎవరూ అందుకోలేదు’ అని పేర్కొన్నారు.

Similar News

News February 16, 2025

హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణిస్తున్నారా?

image

TG: సూర్యాపేట జిల్లాలోని శ్రీలింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. HYD నుంచి విజయవాడ వెళ్లేవారు నార్కెట్‌పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా వెళ్లాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా మళ్లిస్తున్నారు. ఇవాళ, రేపు ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.

News February 16, 2025

దారుణం.. భర్త ఎదుటే భార్యపై అత్యాచారం

image

TG: సంగారెడ్డి(D) ఫసల్‌వాదిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని ఓ తండాకు చెందిన దంపతులు సేవాలాల్ జయంతి సందర్భంగా ఈ నెల 2న అనంతపురం జిల్లాకు కాలినడకన వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఫసల్‌వాదిలోని ఓ విద్యాపీఠంలో భోజనం చేసి చెట్టు కింద నిద్రపోయారు. పెయింటింగ్ పనులు చేసే మాథవన్ (34) భర్తను ఘోరంగా కొట్టి సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేశారు.

News February 16, 2025

రంజీ ట్రోఫీ నుంచి జైస్వాల్ ఔట్?

image

టీమ్ ఇండియా ప్లేయర్ యశస్వీ జైస్వాల్ రంజీ సెమీస్ మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది. కాలి మడమ నొప్పి కారణంగా ఆయన ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17 నుంచి విదర్భతో జరగనున్న సెమీ ఫైనల్ కోసం ముంబై సెలక్టర్లు జైస్వాల్‌ను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆయన గాయపడడం ముంబైకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టులోనూ జైస్వాల్ చోటు దక్కించుకోలేదు.

error: Content is protected !!