News July 12, 2024
రా.7 గంటలకు కాంగ్రెస్‌లో చేరుతున్నా: BRS MLA
TG: కాంగ్రెస్‌లో చేరికపై రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రకటన చేశారు. ఈరోజు రా.7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, ఎవరూ బెదిరించలేదన్నారు. నియోజకవర్గ రైతులు, ప్రజల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఎమ్మెల్యే వెల్లడించారు.
Similar News
News October 31, 2024
మయోనైజ్ గురించి తెలుసా?
బర్గర్లు, శాండ్‌విచ్‌లు, సలాడ్లలో మయోనైజ్ వేసుకుని తింటారు. పచ్చి గుడ్డులోని తెల్లసొనను నూనె, వెనిగర్/నిమ్మరసం, నీటిలో కలిపితే ఇది తయారవుతుంది. దీన్ని తయారుచేసిన 3, 4 గంటల్లోనే వినియోగించాలని లేదంటే సాల్మనెల్లా, లిస్టెరియా మోనోసైటోజెన్, స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే ప్రమాదకర బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా డయేరియా, కడుపునొప్పి లాంటి సమస్యలు వస్తాయి. తాజాగా TG ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసింది.
News October 31, 2024
వేద పండితులకు రూ.3,000.. ఉత్తర్వులు జారీ
AP: రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 600 మందికి సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల నుంచి సంభావన చెల్లించాలని పేర్కొంది. ఈ సాయం పొందే పండితులు వారి నివాసానికి సమీపంలోని ఆలయంలో రోజూ గంటపాటు వేద పారాయణం చేయాలంది.
News October 31, 2024
ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు
కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.