News July 12, 2024
రా.7 గంటలకు కాంగ్రెస్‌లో చేరుతున్నా: BRS MLA

TG: కాంగ్రెస్‌లో చేరికపై రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రకటన చేశారు. ఈరోజు రా.7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, ఎవరూ బెదిరించలేదన్నారు. నియోజకవర్గ రైతులు, ప్రజల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఎమ్మెల్యే వెల్లడించారు.
Similar News
News February 7, 2025
అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి

AP: రాజధాని అమరావతిలో పలు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు ఈసీ అనుమతిచ్చింది. ప్రస్తుతం కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. దీంతో అమరావతిలో పనులకు అనుమతి ఇవ్వాలని సీఆర్డీఏ ఈసీకి లేఖ రాయగా అభ్యంతరం లేదని బదులిచ్చింది. టెండర్లు పిలవొచ్చని, అయితే ఎన్నికలు పూర్తయ్యాకే ఖరారు చేయాలని పేర్కొంది.
News February 7, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 7, 2025
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఫిబ్రవరి 07, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.38 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.14 గంటలకు
✒ ఇష: రాత్రి 7.28 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.