News July 12, 2024
కవిత బెయిల్‌పై 22న తీర్పు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 22న వెల్లడించనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కాగా కవితపై ఛార్జిషీట్ లోపభూయిష్టంగా ఉందని ఆమె తరఫు లాయర్లు వాదించారు. డిఫెక్టివ్ ఛార్జిషీట్ ఉన్నప్పుడు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని వారు పేర్కొన్నారు. ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ కోర్టుకు నివేదించింది.
Similar News
News January 21, 2025
నేటి నుంచి దరఖాస్తులకు మరో అవకాశం
TG: రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి అవకాశమివ్వాలని సర్కారు నిర్ణయించింది. అలాంటివారి నుంచి గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది.
News January 21, 2025
మరో వారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో వారంపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో టెంపరేచర్ 15°C కంటే తక్కువగా నమోదవుతుండటంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News January 21, 2025
ఎంపీల కారు అలవెన్సుగా నెలకు రూ.లక్ష
AP: రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల కార్లకు అలవెన్సుల కింద నెలకు రూ.లక్ష చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రులకు మినహా మిగతా ఎంపీలకు ఈ అలవెన్స్ వర్తించనుంది. అలాగే డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్‌కు గృహోపకరణాల కొనుగోలుకు ఒకసారి గ్రాంటుగా రూ.1.50లక్షల చొప్పున రూ.4.50 లక్షలు మంజూరు చేస్తూ మరో ఉత్తర్వును సర్కారు జారీ చేసింది.