News July 12, 2024

కవిత బెయిల్‌పై 22న తీర్పు

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 22న వెల్లడించనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కాగా కవితపై ఛార్జిషీట్ లోపభూయిష్టంగా ఉందని ఆమె తరఫు లాయర్లు వాదించారు. డిఫెక్టివ్ ఛార్జిషీట్ ఉన్నప్పుడు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని వారు పేర్కొన్నారు. ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ కోర్టుకు నివేదించింది.

Similar News

News February 19, 2025

శివాజీ జయంతికి రాహుల్ గాంధీ శ్రద్ధాంజలి..

image

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. జయంతి వేళ ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని రాయడమే ఇందుకు కారణం. సాధారణంగా వర్ధంతులకే ఇలా చెప్తుంటారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ శివాజీ విగ్రహాలను తీసుకొనేందుకు ఆయన వెనుకాడటం, నిర్లక్ష్యం చేయడాన్ని కొందరు యూజర్లు గుర్తుచేస్తున్నారు.

News February 19, 2025

ఢిల్లీ CM ఎన్నిక: అబ్జర్వర్లను నియమించిన BJP

image

ఢిల్లీ CM అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. PM మోదీ నివాసంలో సమావేశమైన పార్లమెంటరీ ప్యానెల్ రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాశ్ ధన్‌ఖడ్‌ను అబ్జర్వర్లుగా నియమించింది. 7PMకు BJP MLAలు సమావేశం అవుతారు. అక్కడ వీరిద్దరూ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. అంటే రాత్రి వరకు అభ్యర్థి ఎవరో తేలే అవకాశం లేదు. మరోవైపు DCC చీఫ్, కేజ్రీవాల్, ఆతిశీని ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానాలు పంపినట్టు తెలిసింది.

News February 19, 2025

CT: తొలి మ్యాచులో బ్యాటింగ్ ఎవరిదంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచుకు తెరలేసింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
PAK: ఫకర్ జమాన్, బాబర్, షకీల్, రిజ్వాన్(C), సల్మాన్, తాహిర్, అఫ్రీది, నసీమ్, రవూఫ్, అహ్మద్.
NZ: కాన్వే, యంగ్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, సాంట్నర్(C), నాథన్ స్మిత్, హెన్రీ, విలియమ్ ఓరౌర్కే.

error: Content is protected !!