News July 12, 2024
డ్రగ్స్ కేసులో ఎంపీ అమృత్పాల్ సోదరుడు అరెస్ట్

ఖలిస్థానీ నేత, ఎంపీ అమృత్పాల్ సింగ్ తమ్ముడు హర్ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. హర్ప్రీత్ తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేశారు. అందులో డ్రగ్స్ కనిపించడంతో స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా అమృత్పాల్ ప్రస్తుతం దిబ్రుగఢ్ జైల్లో ఉన్నారు. ఆయన పంజాబ్లోని ఖాడూర్ సాహిబ్ సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
Similar News
News July 9, 2025
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

TG: తమ రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని సీఎం రేవంత్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై కేంద్ర ఎరువులశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ‘తెలంగాణలో యూరియా కొరత లేకుండా చేస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని జిల్లాలకు యూరియాను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో కాస్త యూరియా వాడకం తగ్గిస్తే భూసారం దెబ్బతినకుండా ఉంటుంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
News July 9, 2025
BRS వల్లే కృష్ణా జలాల్లో TGకి అన్యాయం: మంత్రి ఉత్తమ్

TG: BRS హయాంలోనే రాయలసీమకు కృష్ణా నీటిని అక్రమంగా తరలించే ఏర్పాట్లు జరిగాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ‘కల్వకుర్తి, నెట్టెంపాడు, SLBC, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను BRS పూర్తి చేయలేదు. కృష్ణా జలాల్లో TGకి 299 TMCలు చాలని KCR ఒప్పుకున్నారు. APకి 512 TMCలు ఇచ్చేందుకు అంగీకరించారు. మా ప్రభుత్వం వచ్చాకే TGకి 578 TMCలు కావాలని అపెక్స్ కౌన్సిల్ను కోరాం’ అని కృష్ణా జలాలపై ప్రజెంటేషన్లో వివరించారు.
News July 9, 2025
నిమిష మరణ శిక్ష రద్దుకు చివరి మార్గమిదే..

హత్య కేసులో కేరళ నర్సు <<16996463>>నిమిషకు<<>> యెమెన్ ఈనెల 16న మరణశిక్ష అమలు చేయనుంది. ఆమెకు శిక్ష తప్పాలంటే మృతుడి కుటుంబసభ్యులు క్షమాభిక్ష పెట్టడమే చివరి మార్గం. ఇందుకు 2020 నుంచి మానవ హక్కుల యాక్టివిస్ట్ జెరోమ్ ప్రయత్నిస్తున్నారు. వారికి $1 మిలియన్ పరిహారం, మృతుడి సోదరుడికి UAE లేదా సౌదీలో శాశ్వత నివాసం వంటి ఆఫర్లిచ్చారు. భారత ప్రభుత్వం సహకరిస్తోందని, లేదంటే ఇప్పటికే మరణశిక్ష అమలయ్యేదని జెరోమ్ తెలిపారు.