News July 12, 2024
డ్రగ్స్ కేసులో ఎంపీ అమృత్‌పాల్ సోదరుడు అరెస్ట్

ఖలిస్థానీ నేత, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ తమ్ముడు హర్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. హర్‌ప్రీత్ తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేశారు. అందులో డ్రగ్స్ కనిపించడంతో స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా అమృత్‌పాల్ ప్రస్తుతం దిబ్రుగఢ్ జైల్లో ఉన్నారు. ఆయన పంజాబ్‌లోని ఖాడూర్ సాహిబ్ సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
Similar News
News February 13, 2025
మంచి మాట – పద్యబాట

కానివాని తోడ గలసి మెలగుచున్న
గానివాని వలెనె కాంతు రతని
తాడి క్రింద బాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమ
భావం: దుష్టులతో కలిసి తిరిగితే మంచివాడిని కూడా ఈ లోకం చెడ్డవాడిగానే పరిగణిస్తుంది. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నా తాటికల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కదా.
News February 13, 2025
కేఎల్ రాహులే మాకు ప్రాధాన్యం: గంభీర్

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీపింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ కోచ్ గంభీర్ ఆయనకు అండగా నిలిచారు. ‘టీమ్ ఇండియాకు ప్రస్తుతం రాహులే నంబర్ వన్ వికెట్ కీపర్. అతడే మా ప్రాధాన్యం. పంత్‌కు తన అవకాశాలు తనకొస్తాయి. ఇప్పటికైతే ఇద్దరు కీపర్లను ఆడించే పరిస్థితి లేదు’ అని తేల్చిచెప్పారు. పంత్‌తో పోలిస్తే రాహుల్ బ్యాటింగ్ రికార్డులు మెరుగ్గా ఉండటంతో అతడివైపే జట్టు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.
News February 13, 2025
కాంగ్రెస్ ఎన్నికలకు భయపడుతోంది: బండి

TG: కులగణనలో లోపాలు, అవకతవకలు జరిగాయని, ఇది బూటకపు సర్వే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ భయపడుతోంది. కులగణనను పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకుంటోంది. ఎన్నికలను ఆలస్యం చేయడానికే రీ-సర్వే డ్రామా. ఆధార్‌ను అనుసంధానిస్తూ ఇంటింటికి వెళ్లి మళ్లీ సర్వే చేయాలి. బీసీ కేటగిరీలో ముస్లింలను చేర్చవద్దు. బీసీ జనాభాను తగ్గించవద్దు’ అని ట్వీట్ చేశారు.