News July 12, 2024

అమరావతి కట్టడాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: రాజధాని అమరావతిలోని కట్టడాల పటిష్ఠతపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల బేస్‌మెంట్లు, ఐఏఎస్, ఎన్జీఓల సముదాయాల పటిష్ఠతపై స్టడీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వీటి పటిష్ఠత నిర్ధారణ బాధ్యతలను ఐఐటీ చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ఐఐటీ చెన్నై ఇచ్చే నివేదిక ఆధారంగా భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

Similar News

News January 24, 2026

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

image

AP: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు 2 సెషన్లలో (9.00 AM-12.00PM, 2.00PM-5.00PM) ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్/ ఆధార్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. <>వెబ్‌సైట్‌<<>>లో, మన మిత్ర సర్వీసు(9552300009)లో అందుబాటులో ఉన్నట్లు చెప్పింది.

News January 24, 2026

కిషన్ రెడ్డి నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నా: భట్టి

image

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిపై ఎంక్వైరీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నట్లు Dy.CM భట్టి అన్నారు. ‘105ఏళ్లుగా సింగరేణి కొనసాగుతోంది. ఆ సంస్థ నిర్ణయాలు మంత్రి వద్దకు రావు. కోల్ ఇండియా 2018లో టెండర్ డాక్యుమెంట్ పంపింది. సైట్ విజిట్ తప్పనిసరి అని CMPDI డాక్యుమెంట్‌లో ఉంది. ఆ సమయంలో మా ప్రభుత్వం లేదు. 2021, 2023లో కోల్ ఇండియా, NMDC పంపిన డాక్యుమెంట్లలోనూ సైట్ విజిట్ అని ఉంది’ అని స్పష్టం చేశారు.

News January 24, 2026

పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

image

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్‌లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.