News July 12, 2024
అమరావతి కట్టడాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: రాజధాని అమరావతిలోని కట్టడాల పటిష్ఠతపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల బేస్‌మెంట్లు, ఐఏఎస్, ఎన్జీఓల సముదాయాల పటిష్ఠతపై స్టడీ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వీటి పటిష్ఠత నిర్ధారణ బాధ్యతలను ఐఐటీ చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ఐఐటీ చెన్నై ఇచ్చే నివేదిక ఆధారంగా భవన నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
Similar News
News November 13, 2025
రాష్ట్రంలో 107 ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

ఏపీ మెడికల్ &హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆయూష్ విభాగంలో 107 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, MBA, M.COM, CA, ICWA, MD, BAMS, BHMS, BUMS, BNYS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, BC, EWSలకు రూ.750. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/
News November 13, 2025
ఘంటానాదం వెనుక శాస్త్రీయత

శబ్దాలు 2 రకాలు. అవి ధ్వని, నాదం. ఒకసారి వచ్చి ఆగేది ధ్వని. కొంతసేపు కొనసాగేది నాదం. గుడిలో గంట శబ్ధం నాదాన్ని సృష్టిస్తుంది. ‘నాదం’ అంటే ప్రాణం, అగ్ని కలయిక. ధ్వని మనసుకు చికాకు కలిగిస్తుంది. కానీ నాదం అలా కాదు. గుడిలోని ఘంటానాదం చెవులకు, మన ఆరోగ్యానికి చాలా మందిది. ఇది చెవులకు వ్యాయామంలా పనిచేస్తుంది. ఘంటానాద తరంగాలు రోగ క్రిములను దూరం చేస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. <<-se>>#Scienceinbelief<<>>
News November 13, 2025
కాపర్ టీ వాడుతున్నారా?

అవాంఛిత గర్భధారణను నివారించడానికి చాలామంది మహిళలు కాపర్ టీ వాడతారు. అయితే దీన్ని సరిగ్గా ప్లేస్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, కొన్నిసార్లు గర్భాశయ లైనింగ్ గాయపడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో దాన్ని తొలగించుకోవాలని సూచిస్తున్నారు.


