News July 15, 2024
టిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణాలు

AP: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) అంగీకరించింది. దీనిపై ప్రభుత్వ అధికారులు హడ్కో ప్రతినిధులతో చర్చించారు. ఎంత ఖర్చు అవుతుందనే దానిపై రెండు రోజుల్లో హడ్కోకు నివేదిక ఇవ్వనున్నారు. పెండింగ్‌లో ఉన్న 1.17లక్షల గృహాలను పూర్తిచేయడానికి ₹5,070 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
Similar News
News December 29, 2025
అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్.. సీఎం ఏమన్నారంటే?

TG: కేసీఆర్ కాసేపటికే అసెంబ్లీ నుంచి <<18700840>>వెళ్లిపోవడంపై<<>> సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘వెంటనే ఎందుకు వెళ్లారన్నది ఆయననే అడగాలి. ప్రతి సభ్యుడిని మేము గౌరవిస్తాం. ఈ రోజే కాదు ఆసుపత్రిలో కూడా KCRను కలిశాను’ అని అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. అటు మాజీ ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీ సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
News December 29, 2025
తెలుగు సంవత్సరాలు 60 ఎందుకు?

నారదుడు విష్ణుమాయ వల్ల స్త్రీ రూపం దాల్చి ఓ రాజును పెళ్లి చేసుకుని 60 మంది పిల్లలకు జన్మనిచ్చారు. యుద్ధంలో వారు మరణించగా, విష్ణుమూర్తి వారికి కాలచక్రంలో 60 ఏళ్లుగా నిలిచే వరాన్నిచ్చారు. కలియుగ మానవ ఆయుష్షులో మొదటి 60 ఏళ్లు లౌకిక, 60 ఏళ్లు ఆధ్యాత్మికతకు కేటాయించారు. 60 ఏళ్లు నిండగానే ‘షష్టిపూర్తి’ చేసుకొని తిరిగి బాల్యదశలోకి ప్రవేశిస్తాడని, అందుకే వారిని పిల్లల్లా చూసుకోవాలని అంటుంటారు.
News December 29, 2025
యూట్యూబర్ అన్వేష్‌ను అరెస్ట్ చేయండి: VHP

AP: యూట్యూబర్ అన్వేష్‌పై (నా అన్వేషణ) కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హిందూ దేవతలు, భారత మహిళల వస్త్రధారణపై అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని VHP ప్రతినిధులు విశాఖ గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడిన అతడిని అరెస్ట్ చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలతో అన్వేష్ ఇన్‌స్టాలో లక్షకు పైగా ఫాలోవర్లను కోల్పోయారు.


