News July 15, 2024
టిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణాలు
AP: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) అంగీకరించింది. దీనిపై ప్రభుత్వ అధికారులు హడ్కో ప్రతినిధులతో చర్చించారు. ఎంత ఖర్చు అవుతుందనే దానిపై రెండు రోజుల్లో హడ్కోకు నివేదిక ఇవ్వనున్నారు. పెండింగ్‌లో ఉన్న 1.17లక్షల గృహాలను పూర్తిచేయడానికి ₹5,070 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
Similar News
News October 8, 2024
హరియాణా: హ్యాట్రిక్ కొట్టిన చరిత్రే లేదు
హరియాణా ప్రజలు ఇప్పటి వరకు వరుసగా మూడోసారి ఎవరికీ పట్టం కట్టిన చరిత్ర లేదు. గరిష్ఠంగా రెండుసార్లే ఒక పార్టీకి అధికారం అప్పజెప్పారు. 1968, 72లో; 2005, 09లో కాంగ్రెస్‌ను గెలిపించారు. 2014, 19లో బీజేపీని అందలమెక్కించారు. దీనికి బ్రేక్ చేసి హ్యాట్రిక్ అందుకోవాలన్న బీజేపీ కల నెరవేరేలా లేదు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కే తీర్పునిచ్చాయి. JJP ఓటు బ్యాంకు వారికే బదిలీ అయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
News October 8, 2024
ఢిల్లీలో ₹65కే కిలో టమాటా
టమాటా రేటు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని సామాన్యులకు కేంద్రం ఉపశమనం కలిగించింది. అక్కడ కిలో టమాటా ₹100-₹120 పలుకుతోంది. దీంతో హోల్‌సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ఢిల్లీ సహా శివారులోని 56 ప్రాంతాల్లో ₹65కే ప్రజలకు అందిస్తోంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా టమాటా పండించే ప్రధాన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో దిగుబడి బాగా తగ్గింది. దీంతో ధరలు పెరిగాయి.
News October 8, 2024
ఈరోజు దుర్గమ్మను దర్శిస్తే ఐశ్వర్యమే!
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు విజయవాడ దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. మంగళప్రదమైన దుర్గమ్మను దర్శించుకున్న వారికి ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుందని ప్రతీతి. మూడు శక్తుల్లో ఒకరైన శ్రీ మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించిన విషయం తెలిసిందే.