News July 16, 2024

ఎల్లుండి నుంచి డీఎస్సీ పరీక్షలు

image

TG: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజూ 26 వేల మందికి చొప్పున రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్ జరగనుంది. మరోవైపు పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక జిల్లా వారికి ఒకే రోజు పరీక్ష ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్నటి వరకు 2.20 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Similar News

News January 12, 2026

అత్తారింటికి కొత్తగా వెళ్తున్న కోడలు పాటించాల్సిన నియమాలు..

image

నూతన వధువు అత్తారింట్లో అడుగుపెట్టిన తొలి 6 నెలలు ఎంతో కీలకం. ఈ సమయంలో కోడలు ఓర్పుతో ఉండాలి. కుటుంబీకుల అలవాట్లను గమనిస్తూ వారితో మమేకం కావాలి. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఇష్టదైవానికి పాయసం నైవేద్యం పెట్టాలి. ఈ నియమం బాధ్యతలకే పరిమితం కాకుండా, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. స్త్రీ ఆత్మగౌరవాన్ని రక్షిస్తుంది. కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ, సామరస్యంగా జీవించడమే ఈ సంప్రదాయాల ప్రధాన ఉద్దేశం.

News January 12, 2026

పంట వ్యర్థాలను ఇలా వాడుకోవడం ఉత్తమం

image

పంట వ్యర్థాలను పశువుల మేతగా, మల్చింగ్ పదార్థంగా వాడాలి. మల్చింగ్ వల్ల నేలలో తేమను పరిరక్షించవచ్చు. కంపోస్ట్ , బయోగ్యాస్, ఇథనాల్ తయారీ, పుట్టగొడుగుల పెంపకం, బయోచార్ తయారీలో వరి పంట కోత తర్వాతి వ్యర్థాలను వాడుకోవచ్చు. పంట అవశేషాల్లోని నత్రజని, భాస్వరం, పొటాషియం, ఇతర సూక్ష్మపోషకాలు భూమికి, పంటకు మేలు చేస్తాయి. అందుకే భూసారం పెరగడానికి, పర్యావరణ పరిరక్షణకు పంట వ్యర్థాలను భూమిలో కలియదున్నడం ఉత్తమం.

News January 12, 2026

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

అంతర్జాతీయ ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు కోల్పోయి 83,135 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు నష్టపోయి 25,555 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. L&T, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, ఎటర్నల్, రిలయన్స్, బెల్, ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.