News July 16, 2024

ఎల్లుండి నుంచి డీఎస్సీ పరీక్షలు

image

TG: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజూ 26 వేల మందికి చొప్పున రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్ జరగనుంది. మరోవైపు పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక జిల్లా వారికి ఒకే రోజు పరీక్ష ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్నటి వరకు 2.20 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Similar News

News December 1, 2024

BREAKING: ఆగిన జియో నెట్‌వర్క్

image

దేశంలోని చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ స్తంభించిపోయింది. ఫోన్ కాల్స్ వెళ్లకపోవడం, స్లో ఇంటర్నెట్, కొన్ని వెబ్‌సైట్లు అసలే ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న యూజర్లు సోషల్ మీడియా వేదికగా టెలికం సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు తమకు 4గంటలుగా సర్వీస్ సరిగా లేదని వాపోతున్నారు. దీనిపై సంస్థ స్పందించాల్సి ఉంది. మీరూ జియో యూజరా? మీకు ఈ సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.

News December 1, 2024

రేపు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ

image

ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ కానుంది. ఏపీలోని మంగళగిరి APIIC కార్యాలయంలో జరిగే ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరగనుంది.

News December 1, 2024

SRH స్ఫూర్తి.. 20ఓవర్లలో 266 రన్స్

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర బ్యాటింగ్‌లో ఊచకోత కోసింది. SRH క్రికెటర్ జయ్‌దేవ్ ఉనద్కత్ నేతృత్వంలోని సౌరాష్ట్ర 20 ఓవర్లలో 266 రన్స్ కొట్టింది. అందులో 21 సిక్సర్లు, 20 ఫోర్లుండటం గమనార్హం. ఛేదనలో బరోడా టీమ్ 20 ఓవర్లలో 188/8కి పరిమితం అయ్యింది. దీంతో 78 పరుగుల తేడాతో గెలిచింది. కాగా ఈ విషయాన్ని ఉనద్కత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘సన్ రైజర్స్‌ సౌరాష్ట్ర’ అంటూ రాసుకొచ్చారు.