News July 16, 2024
ఫేక్ సర్టిఫికెట్స్‌తో వచ్చిన వారిని ఏరివేయాలి: స్మితా సబర్వాల్
ట్రెయినీ IAS పూజా ఖేద్కర్ వ్యవహారంపై IAS స్మితా సబర్వాల్ స్పందించారు. ‘సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చేందుకు కొందరు ఫేక్ సర్టిఫికెట్లు ఉపయోగించారనే వార్తలు ఆందోళనకరం. చాలా మంది తెలివైన విద్యార్థులు IAS, IPS కావడం వారి గమ్యస్థానంగా పరిగణిస్తారు. మెరిట్ ద్వారానే వారు దానిని చేరుకోగలరు. సమగ్ర విచారణ జరిపి ఇలాంటి మోసగాళ్లను ఏరివేయాలి. రిజర్వేషన్/ కోటాల విషయంలో వ్యవస్థలో మార్పులు అవసరం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 21, 2025
పిల్లి చేసిన పనికి ఉద్యోగం పోయిందిగా..!
ఏంటి షాక్ అయ్యారా? చైనాకు చెందిన ఓ యువతికి ఇలాంటి విచిత్రమైన సంఘటనే ఎదురైంది. ఆ యువతి తన రాజీనామా లేఖను డ్రాఫ్ట్‌లో ఉంచింది. అయితే, ల్యాప్‌టాప్‌ను వదిలేసి వెళ్లగా అనుకోకుండా పెంపుడు పిల్లి కీబోర్డ్ ఎంటర్ బటన్ మీద దూకింది. దీంతో ఆ మెయిల్ యువతి బాస్‌కు చేరడంతో ఉద్యోగంతో పాటు ఇయర్ ఎండ్ బోనస్‌ను కోల్పోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డవగా, ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.
News January 21, 2025
నీరజ్ చోప్రాకు కట్నం ఎంత ఇచ్చారంటే..?
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఇటీవల టెన్నిస్ ప్లేయర్ హిమానీ మోర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కట్నంగా తన అత్తమామల నుంచి నీరజ్ ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. అలాగే ఎలాంటి ఖరీదైన బహుమతులు, వస్తువులు, దుస్తులు కూడా ఆయన స్వీకరించలేదని హిమానీ తల్లిదండ్రులు తెలిపారు. దేవుడి దయ వల్ల తమ అమ్మాయికి దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తితో పెళ్లి కావడం సంతోషంగా ఉందన్నారు.
News January 21, 2025
సీఎం దావోస్ పర్యటన.. తొలి ఒప్పందం
TG: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం కుదిరింది. వినియోగ వస్తువుల తయారీలో పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్, కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది.