News July 16, 2024

స్విగ్గీ, జొమాటోలో మద్యం హోం డెలివరీ?

image

స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ద్వారా మద్యం హోం డెలివరీ చేయాలని లిక్కర్ తయారీదారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ, హరియాణా, పంజాబ్, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడులో ముందుగా చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విధానం సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అమలు చేయాలని వారు భావిస్తున్నట్లు టాక్. కాగా ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో మద్యం హోం డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News December 30, 2024

మదనపల్లె ఫైల్స్ దహనం.. ప్రధాన నిందితుడు గౌతమ్ అరెస్ట్

image

AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరులో అతడిని అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. గౌతమ్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. జులై 21న జరిగిన అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

News December 30, 2024

₹21 వేల కోట్ల‌కు డిఫెన్స్ ఎగుమతులు: రాజ్‌నాథ్

image

ద‌శాబ్ద కాలంలో డిఫెన్స్ ఎగుమతులు ₹2 వేల కోట్ల నుంచి ₹21 వేల కోట్ల‌కు పెరిగాయ‌ని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆర్మీ వార్ కాలేజీలో ఆయ‌న మాట్లాడుతూ 2029 నాటికి ₹50 వేల కోట్ల ఎగుమ‌తులు ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు వెల్ల‌డించారు. AI, సైబ‌ర్‌, స్పేస్ ఆధారిత స‌వాళ్లు అధిక‌మ‌వుతున్న నేపథ్యంలో సైన్యం వీటిని ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధ‌మై ఉండాలన్నారు. మహూలో శిక్షణ కేంద్రాల పనితీరును రాజ్‌నాథ్ అభినందించారు.

News December 30, 2024

‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ ఇప్పుడెలా ఉన్నాడంటే?

image

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. రెండు రోజులుగా మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్‌తో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. న్యూరోలాజికల్ స్టేటస్‌లో పెద్దగా మార్పు లేదన్నారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని, పైప్ ద్వారానే ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి జ్వరం లేదని వివరించారు.