News July 16, 2024
స్విగ్గీ, జొమాటోలో మద్యం హోం డెలివరీ?
స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ద్వారా మద్యం హోం డెలివరీ చేయాలని లిక్కర్ తయారీదారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ, హరియాణా, పంజాబ్, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడులో ముందుగా చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విధానం సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అమలు చేయాలని వారు భావిస్తున్నట్లు టాక్. కాగా ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో మద్యం హోం డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News October 11, 2024
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య: పొంగులేటి
TG: GOVT స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ‘అమ్మ ఆదర్శ పథకం’ కింద ₹657 కోట్లు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం(D) పొన్నెకల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమది చేతల ప్రభుత్వమని చెప్పారు. విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
News October 11, 2024
గోపీచంద్ ‘విశ్వం’ REVIEW
మంత్రి హత్యను చూసిన ఓ పాప ప్రాణాలను రక్షించేందుకు గోపీరెడ్డి అలియాస్ విశ్వం రంగంలోకి దిగుతాడు. అసలు ఈ విశ్వం ఎవరు, ఎందుకు పాపను రక్షిస్తున్నాడు అన్నది బ్యాలెన్స్ కథ. గోపీచంద్ తన పాత్రను అలవోకగా పోషించారు. నరేశ్, ప్రగతి, పృథ్వీరాజ్, వెన్నెల కిషోర్ కామెడీ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో కథను హడావుడిగా చుట్టేయడమే మైనస్. శ్రీను వైట్ల గత 3 సినిమాలతో పోలిస్తే ‘విశ్వం’ బాగుందని చెప్పొచ్చు.
రేటింగ్: 2.25/5
News October 11, 2024
వరదల్లో జగన్ అడుగు బయటపెట్టలేదు: లోకేశ్
AP: చట్టాన్ని ఉల్లంఘించిన వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో పేరుందని వారు భయపడుతున్నారన్నారు. వరదలొచ్చినప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టలేదని, ఇప్పుడు వరద సాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.