News July 17, 2024

హార్దిక్‌తో విడాకుల రూమర్స్.. సెర్బియా వెళ్లిపోయిన నటాషా?

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య భార్య నటాషా స్వదేశం సెర్బియా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కుమారుడు అగస్త్యతో కలిసి ఆమె కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు ఇన్‌స్టాలో ‘ఆ సమయం వచ్చింది’ అనే అర్థం వచ్చేలా నటాషా ఓ పోస్ట్ పెట్టారు. విమానం, ఇంటి ఎమోజీలను షేర్ చేయడంతో సెర్బియా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 12, 2026

ఇక డాక్టర్ చదువులు అక్కర్లేదట.. ఎందుకో చెప్పిన మస్క్!

image

ఎంతో కష్టపడి చదివి మనిషి ప్రాణాలను నిలబెట్టే డాక్టర్ కోర్సులు ఇక అవసరం లేదట. వైద్య విద్యలన్నీ ఉపయోగం లేకుండా పోతాయట. ప్రపంచ కుబేరుడు మస్క్ అంచనాలివి. AIలో వస్తున్న మార్పులతో భవిష్యత్తులో రోబోలే క్లిష్టమైన సర్జరీలూ చేస్తాయని చెప్పారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ ఆరోగ్య సంరక్షణ సేవలూ మెరుగవుతాయని తెలిపారు. ఒక దేశాధ్యక్షుడికి అందే వైద్య సౌకర్యాలు సామాన్యుడికీ అందుబాటులోకి వస్తాయన్నారు.

News January 12, 2026

రైతులకు బోనస్ డబ్బులు విడుదల

image

TG: సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సన్న వడ్లకు రూ.500 కోట్ల బోనస్ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.1,429 కోట్ల బోనస్ డబ్బులు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. కాగా సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

News January 12, 2026

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

image

PM మోదీ కొత్త ఆఫీసు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న అందులోకి ఆయన షిఫ్ట్ కానున్నారు. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ‘సేవా తీర్థ్’ కాంప్లెక్స్ నిర్మించారు. ఇందులో PM ఆఫీస్, క్యాబినెట్ సెక్రటేరియట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ భవనాలు నిర్మించారు. 1947 నుంచి సౌత్ బ్లాక్‌లో PMO కొనసాగుతోంది. తరలింపు తర్వాత సౌత్, నార్త్ బ్లాకులను మ్యూజియాలుగా మారుస్తారు.