News July 17, 2024
హార్దిక్‌తో విడాకుల రూమర్స్.. సెర్బియా వెళ్లిపోయిన నటాషా?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య భార్య నటాషా స్వదేశం సెర్బియా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కుమారుడు అగస్త్యతో కలిసి ఆమె కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు ఇన్‌స్టాలో ‘ఆ సమయం వచ్చింది’ అనే అర్థం వచ్చేలా నటాషా ఓ పోస్ట్ పెట్టారు. విమానం, ఇంటి ఎమోజీలను షేర్ చేయడంతో సెర్బియా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 15, 2026
‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’.. ట్రంప్‌కు హెచ్చరిక

ఇరాన్ ప్రభుత్వానికి చెందిన టీవీ ఛానెల్ (Islamic Republic State TV) ట్రంప్‌కు హెచ్చరికలు చేస్తూ సంచలన ప్రసారాలు చేసింది. 2024 ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం దృశ్యాలను టెలికాస్ట్ చేస్తూ, ‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’ అంటూ హెచ్చరించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రసారం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనిపై ఆ దేశ అధికారులు స్పందించలేదు.
News January 15, 2026
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
News January 15, 2026
సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే?

సంక్రాంతి రైతుల పండుగ. ఈ పండుగ నాటికి అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ సంతోషంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. తమకు సహాయం చేసిన పశువులను పూజిస్తారు. కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు, జంగాలు అందరూ సంక్రాంతికే కనిపిస్తారు. వారందరికీ ప్రజలు సంతోషంగా దానధర్మాలు చేస్తారు. ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పడమే ఈ పండుగ ఉద్దేశం.


