News July 17, 2024

ఎర్రమట్టి దిబ్బల తవ్వకం ఆపండి: CMO

image

AP: వైజాగ్‌లో భౌగోళిక వారసత్వ ప్రదేశంగా పేరొందిన ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై పర్యావరణవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిపై సీఎం కార్యాలయం దృష్టి సారించింది. తవ్వకాల్ని ఆపేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణానికి హాని కలిగించే పనుల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించింది. పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

Similar News

News December 26, 2025

మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?

image

ఈ ఏడాది గూగుల్ లెక్కల ప్రకారం మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. తొలిస్థానం తమన్నా సొంతం చేసుకున్నారు. మూవీస్, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లతో ఆమెకు పాన్ ఇండియా లెవల్లో బజ్ వచ్చింది. ఇక రెండో స్థానంలో రష్మిక, మూడో స్థానంలో సమంత, నాలుగో స్థానంలో కియారా అద్వానీ, ఐదో స్థానంలో శ్రీలీల నిలిచారు. మరి మీరు ఎవరి కోసం సెర్చ్ చేశారో కామెంట్ చేయండి.

News December 26, 2025

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా పలు రంగాలలో రాణించిన, ధైర్యసాహసాలు ప్రదర్శించిన 19 మంది పిల్లలకు ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి <<18676177>>రాష్ట్రీయ బాల్ పురస్కార్<<>> అవార్డులను రాష్ట్రపతి అందజేసిన సంగతి తెలిసిందే.

News December 26, 2025

భారత్ ఘన విజయం

image

శ్రీలంక ఉమెన్స్‌తో జరిగిన 3వ టీ20లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 42 బంతుల్లోనే 3 సిక్సర్లు, 11 ఫోర్లతో 79* రన్స్ చేశారు. హర్మన్ 21* పరుగులతో రాణించారు. ఈ విజయంతో మరో 2 మ్యాచులు ఉండగానే 5 టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది.